కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపలో మళ్లీ మూడుచోట్ల భారీ గోతులు: భయాందోళనలో ప్రజలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప: ఏపీలోని కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇంకా భూమి కుంగుతూనే ఉంది. ఆదివారం సికె దిన్నె మండలంలో మరో నాలుగు ప్రాంతాల్లో గోతులు పడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారు ఆందోళన చెందుతున్నారు.

తుఫాను ప్రభావంతో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతరం వారం రోజుల పాటు వర్షాలు ఎడతెరిపి లేకుండా పడ్డాయి. దీంతో, సికె దిన్నె, వేంపల్లే మండలాల్లో పలుచోట్ల భూమి కుంగింది. పదిహేను రోజుల్లో ఇప్పటి వరకు ఇరవైకి పైగా గోతులు పడ్డాయి.

Land sinks in Kadapa, people vacated

ఈ గోతులన్నీ ఇరవై నుంచి ఇరవై అయిదు అడుగుల వెడల్పు ఉన్నాయి. నలభై నుంచి యాభై అడుగుల లోతు వరకు ఉన్నాయి. తాజాగా, సికె దిన్నె మండలంలోని గూడవాడ్లపల్లె, బుగ్గలపల్లె వద్ద మూడు గోతులు ఏర్పడ్డాయి.

ఇవి ఇరవై అడుగుల లోతు, ఇరవై అడుగుల వెడల్పుతో ఏర్పడ్డాయి. ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. భుమి కుంగిన ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని అధికారులు స్థానిక ప్రజలకు చెప్పారు.

English summary
Land sinks in Kadapa district, people vacated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X