అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాబినెట్ లోకి లోకేష్: టిడిపిలో తొలిసారి రెండో పవర్ సెంటర్?

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో నారా లోకేష్ చేరడం ఖాయంగా కన్పిస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గాన్ని చంద్రబాబునాయుడు విస్తరించే అవకాశం ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో నారాలోకేష్ చేరడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ నెల 6వ, తేదిన ఎంఏల్ సి గా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణలో లోకేష్ కు చోటు దక్కే అవకాశం ఉంది.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కొడుకు లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకొనేందకుగాను బాబు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడు.అయితే టిడిపిలో మరో పవర్ సెంటర్ గా లోకేష్ మారనున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. పార్టీ వ్యవహరాలను ఎక్కువగా లోకేష్ చూస్తున్నారు. అయితే అదే సమయంలో మంత్రివర్గంలో చేరితే లోకేష్ మరింత పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహరాల్లో కూడ పట్టుసాధించే అవకాశం ఉంటుంది.అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో రెండో పవర్ సెంటర్ ఏనాడు కూడ ఎక్కువ కాలం మనలేదు.

టిడిపి వ్యవస్థాపకుడు ఎన్ టి ఆర్ కాలం నుండి చంద్రబాబు హయం వరకు ఇదే తంతు కొనసాగింది. నాదెండ్ల భాస్కర్ రావు , చంద్రబాబు హయంలో దగ్గుబాటి, హరికృష్ణలు తొలి నాళ్ళలో రెండో పవర్ సెంటర్ గా మారి తర్వాత కనుమరుగయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో బాబు తర్వాత నెంబర్ టూ గా ఉన్న నేతలంతా కనుమరుగయ్యారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ మంత్రిగా బాధ్యతలుంటే పార్టీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని నాయకత్వం భావిస్తోంది.అధికారులతో పనులు చేయించేందుకుగాను మంత్రి అనే హోదా తప్పనిసరిగా మారింది.దీంతో లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బాబు క్యాబినెట్ లోకి లోకేష్ ...

బాబు క్యాబినెట్ లోకి లోకేష్ ...

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోకి లోకేష్ ను తీసుకొనున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత లోకేష్ ను క్యాబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల తర్వాత చంద్రబాబునాయుడు మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. జూన్ 8వ, తేదికి ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్ళు పూర్తి కానుంది.పార్టీ అవసరాల రీత్యా లోకేష్ ను క్యాబినెట్ లోకి తీసుకోవాలని బాబు నిర్ణయించుకొన్నారు.

తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా బాబు జాగ్రత్తలు

తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా బాబు జాగ్రత్తలు

ఎంఏల్ సి గా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే మంత్రివర్గంలోకి తీసుకొంటే తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలనే యోచనలో బాబు ఉన్నారు. ఈలోపుగా ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్ళు పూర్తి కానుంది. అదే సమయంలో క్యాబినెట్ ను విస్తరిస్తే ప్రయోజనంగా ఉంటుందని బాబు బావిస్తున్నారని సమాచారం.

ముఖ్యమంత్రి వద్ద శాఖల్లో లోకేష్ కు కట్టబెట్టే అవకాశం

ముఖ్యమంత్రి వద్ద శాఖల్లో లోకేష్ కు కట్టబెట్టే అవకాశం

మౌళిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, వాణిజ్యం, సినిమాటోగ్రఫీ, న్యాయశాఖ, టూరిజం వంటి శాఖలన్నీ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దే ఉన్నాయి. పెట్టుబడులు, మౌళిక సదుపాయాల కల్పన పరిశ్రమల శాఖలను లోకేష్ కు అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం.ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలను కేటాయిస్తే పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు.

లోకేష్ కోసం ఎవరికీ కోతలు పెడతారో?

లోకేష్ కోసం ఎవరికీ కోతలు పెడతారో?

మున్సిఫల్ శాఖ ఇవ్వాలనుకొంటే నారాయణ కు కోత పెట్టాల్సి వస్తోంది. మానవ వనరుల శాఖ కావాలనుకొంటే గంటా శ్రీనివాసరావుకు కోత తప్పక పోవచ్చు.పరిశ్రమల శాఖతో పాటు ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ, ఎన్ ఆర్ ఐ వ్యవహరాల శాఖలను కోరుతున్నారని సమాచారం. ఐటిశాఖ కారణంగానే తెలంగాణలో కెటీఆర్ ఇమేజీ పెంచుకొంటున్నారని , ఇదే తరహలో ఐటి శాఖను అప్పగించాలనే కోరుతున్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఐటి శాఖ పల్లె రఘునాథ్ రెడ్డి నిర్వహిస్తున్నారు.

కొందరికీ ఉద్వాసన తప్పక పోవచ్చు

కొందరికీ ఉద్వాసన తప్పక పోవచ్చు

కొందరి శాఖల్లో మార్పులతో పాటు మరికొందరిని మంత్రి వర్గం నుండి తప్పించే అవకాశం లేకపోలేదు.మంత్రివర్గం నుండి తప్పించాలని భావిస్తున్న మంత్రులకు నెలవారీ నివేదికల్లో తక్కువ మార్కులు ఇచ్చారనే ప్రచారం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఈ లోపుగా లోకేష్ పనితీరుపై కూడ అందరికీ అంచనా వచ్చే అవకాశం ఉంది.

English summary
lokesh will be join in chandra babu cabinet soon.tdp politbuero decided lokesh contest as mlc.after budget sessions lokesh will be join in chandrababu naidu cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X