హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహానాడు: తెలంగాణ కోసం చాలా చేశా, పరిటాలను అలా చంపేశారు: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఈవాళ మహానాడు చివరి రోజు. మహానాడుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

<strong>ఓయు కోసం బాబు గళం: ఎన్టీఆర్ శుభలేఖ(పిక్చర్స్)</strong>ఓయు కోసం బాబు గళం: ఎన్టీఆర్ శుభలేఖ(పిక్చర్స్)

ఫొటోస్: మహానాడు Day 1 & Day 2

హైదరాబాద్‌లో మతసామరస్యాన్ని కాపాడిన ఘనత టీడీపీయే అన్నారు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఉండాలని, శాంతి భద్రతలు నాగరికతకు చిహ్నం అని పేర్కొన్నారు.

గోదారి గట్టున ఎన్టీఆర్ విగ్రహం

నదుల అనుసంధానం ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడాలన్నారు. గోదావరి గట్టున ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గోదావరి పుష్కరాలను కనివినీ ఎరగని రీతిలో చేస్తామన్నారు. గోదావరి జలాలు రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ప్రణాళికలు చేస్తామన్నారు.

బాబ్లీపై రాజీలేని పోరాటం

తెలంగాణ కోసం తాము ఎంతో చేశామని, బాబ్లీ కోసం రాజీలేని పోరాటం చేశామని చంద్రబాబు చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. వసతుల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు. పుష్కరాలను రెండు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు నాలుగేళ్లు పడుతుందన్నారు.

Mahanadu on third day in Hyderabad

పిల్లలూ చదువులో పోటీ పడండి

పిల్లలు చదువులో పోటీ పడాలని, ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అరాచక శక్తుల ఆటను కట్టిస్తామన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారన్నారు. శాంతిభద్రతలు నాగరికతకు చిహ్నం అన్నారు. పోకిరీ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

పరిటాల రవిని నిరాయుధుడ్ని చేసి చంపేశారు

కాంగ్రెస్ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను పొట్టన పెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. పరిటాల రవిని నిరాయుధుడిని చేసి చంపారన్నారు. పరిటాల రవికి ప్రాణ భయం ఉన్నట్లు తాను నాడు ప్రధానికి కూడా చెప్పానన్నారు. వైయస్‌కు సూచన చేశారనన్నారు. అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా రాజకీయ హత్యలకు పాల్పడ్డారన్నారు. అరాచక శక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. పవిత్రతకు మారుపేరైన శేషాచలం అడవుల్లో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

English summary
Mahanadu on third day in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X