తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'మహానాడు'లో ఫస్ట్ డే: ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల ఘన నివాళి(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తెలుగుదేశం పార్టీ తిరుపతిలో నిర్వహిస్తున్న పసుపు పండుగ 'మహానాడు' కార్యక్రమం రెండో రోజు ప్రారంభమైంది. తిరుపతికి సమీపంలోని తన సొంతూరు నారావారి పల్లెలో రాత్రి బస చేసిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు.

అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని వేదిక మీదే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు టీడీపీ శ్రేణులు నివాళులర్పిస్తున్నారు.

ముందుగా శనివారం ఉదయం ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ, కల్యాణ్ రామ్, తారకరత్న, లక్ష్మీపార్వతి హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి వేర్వేరుగా ఆయనకు నివాళి అర్పించారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ కూతురు, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి తండ్రికి నివాళి అర్పించారు.

కాగా, కోడలు బ్రాహ్మణితో కలిసి నారా భువనేశ్వరి తన తండ్రి టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే తొలిరోజు మహానాడు కార్యక్రమం పండుగ వాతావరణంలా జరిగింది. మహానాడు సభాప్రాంగణంలోకి చేరుకున్న డిప్యూటీ సీఎం చినరాజప్పకు వేదిక వద్దకు వెళ్లేందుకు దారి కనపడకపోవడంతో తిప్పలు పడాల్సి వచ్చింది.

వేదిక చుట్టూ భారీగా జనసందోహం ఉండటంతో ఆయనకు వేదిక వద్దకు వెళ్లేందుకు దారి కనిపించలేదు. అటు, ఇటుగా రెండుసార్లు చుట్టూ తిరిగి చివరికి పోలీసుల సహకారంతో వేదిక వద్దకు చేరారు. మరోవైపు మహానాడుకు వచ్చిన ప్రతినిధుల కోసం భారీగా ఏర్పాట్లు చేసినా మధ్యాహ్నాం భోజనాల వద్ద తొక్కిసలాట జరిగింది.

భోజనాలు ఏర్పాటు చేసిన ప్రాంగణం చిన్నదిగా ఉండటంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. భోజనాలు కూడా ముందుగానే ప్రారంభించడంతో ఈ సమస్య ఏర్పడిందని అంటున్నారు. వాలంటీర్లు తమ శక్తి కొద్ది ప్రయత్నించినా రద్దీని నివారించడంలో విఫలమయ్యారు. అయితే వంటకాలు బాగున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది.

 తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే'... అని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న తీర్మానాన్ని మహానాడులో ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు ఈ తీర్మానంపై చర్చను ప్రారంభించగా.. ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఇటీవలే టీడీపీలో చేరిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు బలపరిచారు.

 తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

మహానాడు ప్రతినిధుల కోసం భారీగా ఏర్పాట్లు చేసినా మధ్యాహ్నం భోజనాల వద్ద తొక్కిసలాట ఏర్పడింది. భోజనాలకు ఏర్పాటు చేసిన ప్రాంగణం చిన్నదిగా ఉండటం.. ప్రతినిధులు వేలాదిగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. బాగా ముందుగానే భోజనాలు ప్రారంభించినా సమావేశంలో భోజన విరామం ఇచ్చే సమయంలో ఈ సమస్య ఏర్పడింది.

 తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

వలంటీర్లు తమ శక్తికొద్దీ రద్దీని నివారించడానికి ప్రయత్నించారు. రద్దీ ఉన్నా వంటకాల నాణ్యత బాగుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీ నాయకత్వం వంటకాల నాణ్యతపై నిర్వహించిన సర్వేలో అత్యధిక శాతం బాగుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రత్యేకించి రాయలసీమ స్పెషల్‌ అయిన రాగి సంకటి, చింత చిగురు వంకాయ కూర బాగున్నాయని చాలా మంది చెప్పారు.

 తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

‘35 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అధికారంలో ఉన్నాం. ప్రతిపక్షంలో కూర్చున్నాం. ప్రజల కోసం పోరాటాలు చేశాం, లాఠీ దెబ్బలు తిన్నాం. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాం. ఈ ప్రస్థానం ఇంతటితో ఆగకూడదు. తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలచిపోవాలి. అందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలి. అభివృద్ధి.. సంక్షేమ పథకాల్లో భాగస్వాములై పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేస్తామని ప్రతిజ్ఞ చేయండి' అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

 తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

శుక్రవారం మహానాడులో ‘తెలుగుదేశం 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానం' చర్చ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. మన పార్టీకి ఇప్పుడు 35 ఏళ్లని, మంచి యుక్తవయసులో ఉందని, ఎంతో మంది మంచి నాయకులు తయారయ్యారని, వీరిందరి నేతృత్వంలో పార్టీ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలబడేలా కృషి చేయాలని సూచించారు. తెలుగుదేశం ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించినా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిందన్నారు.

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

‘35 ఏళ్ల ప్రయాణంలో చాలా మంది కార్యకర్తలు, నాయకులను కోల్పోయాం. నమ్మిన సిద్ధాంతం కోసం ఎ.మాధవరెడ్డి బలయ్యారు. పరిటాల రవీంద్రను పార్టీ కార్యాలయంలోనే అప్పటి ప్రభుత్వం హత్య చేయించింది. మరెందరో కార్యకర్తలు ప్రతిపక్షాల దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి త్యాగాలు వృథా పోకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి' అని పిలుపిచ్చారు.

 తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. సరిగ్గా 35 ఏళ్ల కిందట హైదరాబాద్‌ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఒక పిల్లకాలువలా ఆరంభమైన తెలుగుదేశం 9 నెలల్లోనే గోదావరి వెల్లువలా మారిందని, మూడున్నర దశాబ్దాలు గడిచినా అదే ఒరవడితో ముందుకు సాగుతోందని అన్నారు.

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

2015-16లో టీడీపీ జమ-ఖర్చుల వివరాలను మంత్రి శిద్దా రాఘవరావు సమర్పించారు. సభ్యత్వ రుసుం, విరాళాల ద్వారా రూ.11,13,12,000, వడ్డీ కింద రూ.4,82,08,000 జమ అయింది. మొత్తంగా రూ.17,97,81,000 ఆదాయం రాగా.. రూ.13,10,73,000 ఖర్చయింది. పార్టీకి రూ.52,90,41,000 ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

 తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తొలిరోజు మహానాడులో పార్టీ యువనేత లోకేష్ చివరి వరసలో కూర్చోగా, ఆయన మామయిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముందు వరసలో కూర్చుకున్నారు. లోకేష్ ఈసారి ఉత్సాహంగా కనిపించారు. నేతల వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు.

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

లోకేష్ వేదిక మీదకు వచ్చిన వెంటనే సీనియర్లు బాబుకు ఇచ్చే గౌరవాన్నే యువనేతకూ ఇవ్వటం కనిపించింది. రామకృష్ణుడు, కెఇ కృష్ణమూర్తి, కళావెంకట్రావు వంటి సీనియర్లు కూడా లేచి అభినందించడం బట్టి, లోకేష్ నాయకత్వానికి పార్టీలో ఆమోదముద్ర పెరుగుతున్నట్లు స్పష్టమయింది.

 తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

శుక్రవారం ఉదయం అధ్యక్ష బాధ్యతను ఆంధ్రకు చెందిన పయ్యావుల కేశవ్‌కు ఇచ్చి, సాయంత్రం సభకు తెలంగాణకు చెందిన సీతక్కకు అప్పగించి ప్రాంతాల సమతుల్యం పాటించారు.

 తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

కాగా, చంద్రబాబు ప్రసంగంలో పెద్దగా కొత్తదనం కనిపించలేదు. ఆ మేరకు బాబు ప్రసంగ పాఠం తయారుచేసే వారు బాబును కొత్త కోణంలో ఆవిష్కరించలేకపోయారు. హోదా, జగన్‌పై విమర్శలు, రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు, గత కొద్దికాలం నుంచి మాట్లాడుతున్న అంశాలతోపాటు, తాజా కలెక్టర్ల భేటీలో మాట్లాడిన అంశాలే పునరావృతం చేశారు.

 తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

తిరుపతి 'మహానాడు'లో ఫస్ట్ డే ఫోటోలు

ఓసీలకు రిజర్వేషన్లు, సర్కారు పథకాలకు పార్టీ ముద్ర రెండు అంశాలే కొత్తగా చోటుచేసుకున్నాయి. అయితే, గతంలో కంటే ఈసారి బాబు ప్రసంగానికి హర్షధ్వానాలు ఎక్కువగా వినిపించాయి. పంచ్ డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి.

English summary
Mahanadu second day meeting starts at tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X