వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వీట్లతో కిషన్: టపాసులు పేల్చిన దత్తన్న(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించడంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహలు వెల్లివిరిసాయి. ఫలితాలు వెలువడగానే నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. డప్పు వాయిద్యాలతో పార్టీ కార్యాలయం మారుమోగింది.

పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. దత్తాత్రేయ బాణాసంచా కాల్చారు. పార్టీ కార్యాలయం ఆవరణలో నాయకులు, కార్యకర్తలు ఆనందంతో నృత్యం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్‌కు ఆ రెండు రాష్ట్రాల ప్రజలు బుద్ధి చెప్పి, ప్రధాని నరేంద్ర మోడీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించారని అన్నారు.

మహారాష్టల్రో చివరి నిమిషంలో శివసేనతో పొత్తు కుదరనందుకే సంపూర్ణమైన మెజారిటీ రాలేదని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హర్యానాలో తమ పార్టీకి పన్నెండింతల బలం పెరిగిందని అన్నారు. మహారాష్ట్ర, హర్యానా ప్రజలు కాంగ్రెస్-ఎన్‌సిపిల పాలనతో బేజారెత్తారని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దక్షిణాదిలో పార్టీ బలం పెరగడం సంతోషకరమని అన్నారు. దేశ రాజకీయాల్లో ఇది శుభపరిణామమని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ప్రజలు తమ పార్టీకి పెద్ద బహుమతి అందించారని అన్నారు. రెండు రాష్ట్రాల్లో బిజెపి గెలుపొందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

టపాసులు పేల్చుతూ..

టపాసులు పేల్చుతూ..

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించడంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహలు వెల్లివిరిసాయి.

స్వీట్లు పంచుతూ..

స్వీట్లు పంచుతూ..

ఫలితాలు వెలువడగానే నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. డప్పు వాయిద్యాలతో పార్టీ కార్యాలయం మారుమోగింది. దత్తాత్రేయ బాణాసంచా కాల్చారు.

డప్పువాయిద్యాలు

డప్పువాయిద్యాలు

పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

నృత్యాలు చేస్తూ..

నృత్యాలు చేస్తూ..

పార్టీ కార్యాలయం ఆవరణలో నాయకులు, కార్యకర్తలు ఆనందంతో నృత్యం చేశారు.

పేలిన టపాసులు

పేలిన టపాసులు

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్‌కు ఆ రెండు రాష్ట్రాల ప్రజలు బుద్ధి చెప్పి, ప్రధాని నరేంద్ర మోడీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించారని అన్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

మహారాష్టల్రో చివరి నిమిషంలో శివసేనతో పొత్తు కుదరనందుకే సంపూర్ణమైన మెజారిటీ రాలేదని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

హర్యానాలో తమ పార్టీకి పన్నెండింతల బలం పెరిగిందని అన్నారు. మహారాష్ట్ర, హర్యానా ప్రజలు కాంగ్రెస్-ఎన్‌సిపిల పాలనతో బేజారెత్తారని ఆయన విమర్శించారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దక్షిణాదిలో పార్టీ బలం పెరగడం సంతోషకరమని అన్నారు.

స్వీట్లు తినిపిస్తూ..

స్వీట్లు తినిపిస్తూ..

దేశ రాజకీయాల్లో ఇది శుభపరిణామమని బండారు దత్తాత్రేయ తెలిపారు.

స్వీట్లు తినిపిస్తూ..

స్వీట్లు తినిపిస్తూ..

హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ప్రజలు తమ పార్టీకి పెద్ద బహుమతి అందించారని అన్నారు.

English summary
BJP's victories in Maharashtra and Haryana put an end to corrupt and inefficient Congress rule in both the states, Telangana BJP president G Kishan Reddy told reporters here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X