వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ కాకా: బిజెపికి షాక్, టిడిపికి ఎదురీత తప్పదా?

కాకినాడ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తెలుగుదేశం - బీజేపీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తెలుగుదేశం - బీజేపీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కావడంతో సీట్లు ఖరారైన అభ్యర్థులు తమతోపాటు నామినేషనన్లు వేసిన ఆశావహుల్ని సంప్రదిస్తున్నారు.

వారితోపాటు పార్టీల నాయకులూ సర్వే ప్రకారం గెలుపు గుర్రాలకు సీట్లు ఇచ్చామని, భవిష్యత్‌లో అవకాశాలు కల్పిస్తామని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అటు పార్టీల నాయకులు, ఇటు సీటు ఖరారైన అభ్యర్థులు చర్చిస్తున్నా, కొందరు ఆశావహులు చెట్టెక్కి కూర్చుంటున్నారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తామంటున్నారు.

భవిష్యత్ రాజకీయానికి కార్పొరేటర్‌ పదవి తొలి మెట్టులాంటిదని, అది ఎక్కకపోతే రాజకీయంగా వెనుకబడిపోతామని వారు భావిస్తున్నారు. దీంతో సీటు ఖరారైన అభ్యర్థులు బుజ్జగింపులు, నజరానాలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. చివరి క్షణంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంతో నామినేషన్లు వేసిన ఆశావహులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు.

దాదాపు పది మంది అభ్యర్దులు నామినేషన్లు వేసిన తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో వారిని వెతికి పట్టుకోడానికి ఆభ్యర్ధులు నానా హైరానా పడుతున్నారు. సీటు ఖరారైన అభ్యర్థులు విత్‌డ్రా చేసుకునే ఆశావహులకు వారి స్థాయిని బట్టి తాయిలాలు ఇస్తామని ఆశ చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

24 స్థానాలకు 280 మంది మహిళల నామినేషన్లు

24 స్థానాలకు 280 మంది మహిళల నామినేషన్లు

పార్టీ అభ్యర్థులపై నామినేషన్లు వేసిన అభ్యర్దులను అధికార టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని వార్తలొచ్చాయి. పార్టీ అధికారంలో ఉంది..నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోకపోతే ఇబ్బందులు పడతావంటూ బెదిరిస్తూ ఇంటికి వెళ్లి వారితో విత్‌డ్రా ఫారాల మీద సంతకాలు చేయించుకుంటున్నారు. మిత్రపక్షాలైన టీడీపీ 35, బీజేపీ తొమ్మిది డివిజన్లలో పోటీ చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. మొత్తం 48 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుంటే 589 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 50 శాతం రిజర్వేషన్‌ కలిగిన మహిళలు 280 మంది ఉన్నారు. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు ఇప్పటి వరకు 35, 9 సీట్లను పంచుకునేందుకు ఏకాభిప్రాయానికి వచ్చాయి. టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసినా... అందరి నుంచీ విత్‌డ్రా ఫారాలపై సంతకాలు చేయించుకుని తీసుకున్నది. జిల్లా ఇన్ చార్జి మంత్రి కళా వెంకట్రావు, జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం - హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అంతా తామై వ్యవహరిస్తున్నారు.

అభ్యర్థులు, నేతల మధ్య వాగ్వాదం

అభ్యర్థులు, నేతల మధ్య వాగ్వాదం

నగరపాలక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తార స్థాయికి చేరింది. పార్టీలోని అసంతృప్తులు మంగళవారం రాత్రి బహిర్గతమయ్యాయి. పార్టీ అభ్యర్థుల ఖరారు కోసం కాకినాడలో ఆ పార్టీ నేతలు సమావేశమైన హోటల్‌ వద్ద కొందరు అభ్యర్థులు, నేతలు వాగ్వాదాలతో హడావుడి సృష్టించడం చర్చనీయాంశమైంది. నగరంలో పార్టీలోని మూడు వర్గాల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం రెండు రోజులుగా నేతలకు తలనొప్పిగా తయారైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాత్రి 10 గంటల తరువాత అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఎన్నికలకు ముందే పార్టీ నేతలు వివాదాలకు దిగడం ఆ పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 1, 10, 16 డివిజన్ల అభ్యర్థుల ఖరారు విషయంలో వివాదాలు తీవ్రమయ్యాయి. దీంతో సంబంధిత రిటర్నింగ్ అధికారులకే అధికారిక అభ్యర్థుల బీ - ఫారమ్‌ అందజేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అధికారులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మద్దతివ్వాలని నిర్ణయం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మద్దతివ్వాలని నిర్ణయం

కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీకి బలమైన సామాజిక వర్గం షాకిచ్చింది. 10వేలకు పైగా ఓటర్లు ఉన్న తమకు టీడీపీ, బీజేపీ మొండిచేయి చూపాయని కమ్మ సామాజిక వర్గ నేతలు మండి పడుతున్నారని సాక్షిలో వార్తా కథనం ప్రచురితమైంది. ఒక్క డివిజన్‌ కూడా కేటాయించకుండా తమను పూర్తిగా విస్మరించారని, వైఎస్సార్‌ సీపీ తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిందని, ఆ పార్టీకే మద్దతు తెలపాలని దాదాపు నిర్ణయించుకున్నారు. తమ సామాజికి వర్గానికి పోటీ చేసే అవకాశం టీడీపీ ఇవ్వలేదని, ఒక్క సీటు కూడా కేటాయించలేదు. వేల ఓట్లు ఉన్న తమపై ఎందుకంత చిన్న చూపని ఆ సామాజిక వర్గ నేతలంతా తీవ్ర ఆగ్రహిస్తున్నారు. మంగళవారం కాకినాడలోని ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులోని ఈటూ రెస్టారెంట్‌లో వారంతా సమావేశమయ్యారు. తమకు టిక్కెట్‌ ఇవ్వకపోగా ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి ప్రవర్తన సరిగా లేదని, తమను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రస్తావించారు. ఎన్నికల్లో ప్రభావం చూపే ఓట్లు ఉన్న తమను చిన్న చూపు చూడటం సరికాదని, ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి తగ్గిన బుద్ధి చెప్పాలని నిర్ణయించారు. టీడీపీ, బీజేపీ అనుసరించిన తీరుకు నిరసనగా ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడ్డుభాస్కర రామారావు పాల్గొన్నారు.

బీజేపీకి ఇలా టీడీపీ షాక్

బీజేపీకి ఇలా టీడీపీ షాక్

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీకి షాక్‌ ఇచ్చింది. తమకు అడిగిన డివిజన్‌లు కేటాయించకుండా, టీడీపీ పట్టులేని, అభ్యర్థులు దొరకని డివిజన్‌ల కేటాయించి పొత్తు మమా అనిపించడంతో బీజేపీ పరిస్థితి అనుకున్నదొక్కటి... అయినదొక్కటి అన్నట్టు తయారయింది. మొదటి నుంచి సగం సీట్లు కావాలని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన బీజేపీ టీడీపీ ఇచ్చిన సీట్లుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పొత్తులు తేలకపోవడంతో సీట్లు ఆశించిన బీజేపీ కార్యకర్తలు నగరంలో 24 డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేశారు. తీరా చూస్తే కేవలం తొమ్మిది డివిజన్‌లు మాత్రమే కేటాయించింది. సోమవారం రాత్రి పొత్తులపై సృష్టత రావడంతో తమ సంగతేమిటని బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ కార్యకర్తలు నామినేషన్లు ఉపసంహరించుకొనేలా నాయకులు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.

వీరు బరిలో దిగితే తమ ఓట్లు చీలిపోతాయని భావిస్తున్న టీడీపీ నాయకులు వీరికి డబ్బులు ఎర వేస్తున్నారు. వీరికి రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకూ ఇచ్చేందుకు ఒప్పందాలు జోరందుకున్నాయి. కాకినాడ జగన్నాథపురంలోని పలు డివిజన్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పొత్తు ధర్మం పాటించాలని, మనకు కేటాయించిన డివిజన్లు మినహా మిగిలిన డివిజన్లలోను నామినేషన్లు ఉపసంహరించుకొనకుంటే ఆయా కార్యకర్తలపై చర్యలు తప్పవని బీజేపీ నాయకులు కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని తమ సత్తా చాటుతామని పలువురు కార్యకర్తలు బీజేపీ నాయకులు వద్ద తేల్చేశారని తెలుస్తున్నది. దీంతో తాము ఓడిపోతామనే గుబులు టీడీపీ నాయకుల్లో మొదలయ్యింది. దీంతో వారు ఏదోలా నామినేషన్‌ ఉపసంహరించే విధంగా చూడాలని ఇరుపార్టీ నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

బీజేపీలో సీటు ఇప్పిస్తే రెండు డివిజన్ల ఖర్చు ఒక్కరిదే..

బీజేపీలో సీటు ఇప్పిస్తే రెండు డివిజన్ల ఖర్చు ఒక్కరిదే..

బీజేపీలోని ఒక డివిజన్‌ అభ్యర్థి అదే పార్టీలో మరో అభ్యర్థికి ఇంకో డివిజన్‌ నుంచి పోటీ చేయడానికి బీ - ఫామ్ ఇప్పించాడు. దీనికి ప్రతిఫలంగా తన డివిజన్‌లో ఎన్నికల ఖర్చు మొత్తం భరించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు పార్టీ వర్గాల కథనం. 26 డివిజన్లలో బీజేపీ ఆశావహకులు నామినేషన్లు వేస్తే పొత్తులో ఆ పార్టీకి 9 డివిజన్లు లభించాయి. అయితే 26వ డివిజన్లకు బీజేపీ ఆశావహులు నామినేషన్లు వేయడంతో టీడీపీ, బీజేపీల్లో సీటు ఖరారైన అభ్యర్దులు మిగిలిన వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. బీజేపీ తరఫున రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు అన్ని వ్యవహారాలను పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మూడు మీడియా సంస్థలు తమదైన శైలిలో వార్తాకథనాలు వండి వారుస్తూ సామాన్యులకు అందజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి సొంత పత్రిక ‘సాక్షి'.. అధికార తెలుగుదేశం పార్టీ - బీజేపీ కూటమిలో లోపాలను ఎత్తిచూపితే.. నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు అందిస్తున్నామని, అక్షరం మా ఆయుధమని ప్రకటించే ఆంధ్రజ్యోతి.. తెలుగు జర్నలిజానికి ఓనమాలు దిద్దించామని చెప్పుకునే ‘ఈనాడు' వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బయటపెడుతూనే మరోవైపు అధికార టీడీపీలో పరిస్థితి భేష్షుగ్గా ఉన్నదన్న వార్తాకథనాలు వండి వార్చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Telugu Desam party (TDP) is facing trouble im Kakinada Municipal corporation elections with independents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X