హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఏప్రిల్ 4న హైదరాబాద్‌ నీటి సరఫరాలో అంతరాయం'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మహార్దశ పట్టనుంది. ఇందులో భాగంగా కృష్ణా ఫేజ్-3 నీరు ఏప్రిల్ 4 నుంచి సరఫరా చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ ఎండీ జగదీశ్వర్ అన్నారు. కృష్ణా ఫేజ్-3 నీటి సరఫరా కారణంగా ఏప్రిల్ 4న నగరానికి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.

కృష్ణా ఫేజ్-1, కృష్ణా ఫేజ్-2కి ఏప్రిల్ 4న కాకుండా 6వ తేదీని నీటి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. నీటి వినియోగదారులు పొదుపు చర్యలు పాటించాలని కూడా జగదీశ్వర్ కోరారు. అయితే బస్తీలకు, ఇతర ప్రాంతాలకు మాత్రం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

కృష్ణా ఫేజ్-3 నీటిని రింగ్ మేన్-2 ద్వారా మాత్రమే ఏప్రిల్ 4న నీటి సరఫరా చేస్తామని చెప్పారు. రింగ్ మేన్-1 పనులు పూర్తికి మరో మూడు నెలలు సమయం పడుతుందని ఆయన చెప్పారు.

Major water supply shutdown on April 4

కృష్ణా మూడో దశ ప్రాజెక్ట్ 1 కింద ప్రభావితమయ్యే ప్రాంతాలు:

నారాయణ గూడ, భర్కత్ పుర, నల్లకుంట, ముషీరాబాద్, నింబోలిఅడ్డ, అదిక్మెట్, శివం, చిలకలగూడ, వినాయక్ నగర్, ఆస్మన్గంద్, చంచల్గూడ, చంద్రాయణగుట్ట, మైసారం, యాకత్పుర, సంతోష్ నగర్, వైశాలి నగర్, దిల్‌షుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఎన్టీఆర్ నగర్ , అల్కాపురి, మలక్ పేట, మిరాలం, మిస్రీ గుంజ్ , బహుదూర్ పుర్, అజాంపుర్, మొఘల్పుర్, అలియాబాద్ రిజర్వాయర్ ప్రాంతాలు.

కృష్ణా మూడో దశ ప్రాజెక్ట్ 2 కింద ప్రభావితమయ్యే ప్రాంతాలు:

సాహెబ్ నగర్, బాలాపుర్, మైలాదేవ్‌పల్లి, హైదరగూడ, ఉప్పరపల్లి, ప్రశాంత్ నగర్, లింగంపల్లి, మారేడ్పల్లి, సీతాఫల్ మండి, మెట్టుగూడ, తార్నాక, లాలాపేట, మౌలాలి, నాచారం, బీరపడగడ, బోడుప్పల్, హబ్సిగూడ, రామాంత్ పుర్, మల్కాజ్గిరి, డిఫెన్స్ కాలనీ, సైంతపురం, గాయత్రినగర్, చైతన్యపురి, భువనగిరి మున్సిపాలిటీ , గచ్చిబౌలి, సైనికపురి, ఏలుగుట్ట, కైలాసగిరి, బంజారా హిల్స్, సోమాజిగూడ, ఎర్రగడ్డ, జూబ్లీ హిల్స్, యల్లారెడ్డిగూడ, భాగ్యనగర్, మూసాపేట్

English summary
A major shutdown of water supply will be in place in the city on April 4, as the Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMWSSB) will close the Krishna phase 1 and 2 projects to interconnect it with Krishna phase 3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X