వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు మమత బెనర్జీ సమాధానం ఇదీ!, అమిత్ షాకు జగన్ హామీ

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బిజెపి ప్రకటించింది. ఆయా పార్టీల మద్దతును కూడగట్టేందుకు కొందరు నేతలు బాధ్యత తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి/న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బిజెపి ప్రకటించింది. ఆయా పార్టీల మద్దతును కూడగట్టేందుకు కొందరు నేతలు బాధ్యత తీసుకున్నారు.

కేసీఆర్, జగన్‌లకు మోడీ ఫోన్: మమత గురించి చంద్రబాబు వద్ద ఆరాకేసీఆర్, జగన్‌లకు మోడీ ఫోన్: మమత గురించి చంద్రబాబు వద్ద ఆరా

ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు కూడగట్టే బాధ్యతను ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులకు అప్పగించారు.

Mamata Banerjee answer to Chandrababu Naidu over NDA presidential candidate

సోమవారం అభ్యర్థిని ప్రకటించిన అనంతరం చంద్రబాబు.. మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె నుంచి చంద్రబాబుకు ఆశించిన సమాధానం రాలేదని తెలుస్తోంది. అయితే విషయాన్ని పెండింగులో పెట్టారు.

చంద్రబాబు మద్దతు కోరారు. దానికి మమత సమాధానమిస్తూ.. తాను నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్నానని, వచ్చిన వెంటనే ఈ విషయంపై మాట్లాడతానని చంద్రబాబుతో అన్నారని తెలుస్తోంది.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత రామ్‌నాథ్: ఎవరీ కోవింద్?ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత రామ్‌నాథ్: ఎవరీ కోవింద్?

ఈ ఉదయమే మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె నెదర్లాండ్స్ వెళ్లారు. ఇటీవలే ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ... ఎన్టీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో వెల్లడైన తర్వాతే మద్దతు ప్రకటించాలా? లేదా? అనే విషయం గురించి తాము ఆలోచిస్తామన్నారు.

మరోవైపు, రామ్‌నాథ్ కోవింద్‌ పేరు ప్రకటించడంపై మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యున్నత పదవికి ఒక దళితుడిని ఎంపిక చేశామని బిజెపి చెప్తోందన్నారు. అయితే, కోవింద్‌ బిజెపికి చెందిన దళిత్‌ మోర్చా నాయకుడని, అందుకే ఆయన పేరును ఎంపిక చేశారన్నారు. రామ్‌నాథ్‌కు మించిన దళిత నేతలు దేశంలో చాలామందే ఉన్నారన్నారు. సుష్మా స్వరాజ్‌ పేరునో, అద్వానీ పేరునో సూచించాల్సిందన్నారు. లేకపోతే ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ను రెండోసారి కొనసాగించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

అమిత్ షాకు జగన్ హామీ

ప్రధాని మోడీ తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా వైసిపి అధినేత జగన్‌కు ఫోన్ చేశారు. రామ్‌నాథ్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కోరారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. మీకు మా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే దళిత నేతను ఎంపిక చేయడం పట్ల బిజెపికి అభినందనలు తెలిపారు.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee answer to AP CM Nara Chandrababu Naidu over NDA presidential candidate Ram nath Kovind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X