నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రీ-ప్లాన్డ్: ప్రైవేటు ఫోటోలతో యువతిని బ్లాక్ మెయిల్!, 5లక్షలు గుంజాడు..

అల్లాభక్షు అనే యువకుడు యువతి తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడు.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: అంతా ప్రీ-ప్లాన్డ్ వ్యవహారం.. ఓ అమాయకురాలిని చూసి గాలం వేసిన యువకుడు.. ఆమె నుంచి లక్షల కొద్ది డబ్బు గుంజాడు. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను అడ్డుపెట్టుకుని చెప్పినట్లు నడుచుకోవాలంటూ హుకుం జారీ చేశాడు. గత్యంతరం లేని స్థితిలో ఇంట్లో నుంచే దొంగతనంగా ఆమె డబ్బు తీసుకెళ్లి అతని చేతిలో పెట్టింది.

నెల్లూరులోని మహాత్మాగాంధీనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసముండే గపూర్ బాషా కుమార్తె(22) బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం జ్యోతినగర్ మసీదు వీధికి చెందిన షేక్ అల్లాభక్షుతో పరిచయం ఏర్పడింది. అల్లాభక్షుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఆమెకు తెలియకుండానే అతను తీయించాడు.

ఫోటోలతో బ్లాక్ మెయిల్:

ఫోటోలతో బ్లాక్ మెయిల్:

ఇక ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని ఆమె నుంచి డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫోటోలు ఇంటర్నెట్ లో లీక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. వారం రోజుల్లో రోజుకు రూ.50వేలు చొప్పున తెచ్చి తన చేతిలో పెట్టాలన్నాడు.

ఇంట్లో నుంచే డబ్బు తీసి:

ఇంట్లో నుంచే డబ్బు తీసి:

అల్లాభక్షు హెచ్చరికతో వణికిపోయిన యువతి.. అతని చెప్పినట్లే చేసింది. ఎక్కడ ఫోటోలు లీక్ చేస్తాడోనన్న భయంతో సొంత ఇంట్లో నుంచే రూ.5.72లక్షలు తీసింది. బీరువాలో ఉన్న ఆ డబ్బు తీసి అతను చెప్పిన చోటుకు వెళ్లింది. అంతకుముందు సోమవారం రోజు ఫోన్ ద్వారా ఎక్కడికి రావాలో ఆమెకు అల్లాభక్షు వివరించాడు.

Recommended Video

Police arrested International Robbers gang : Nellore
డబ్బుతో అతని వద్దకు:

డబ్బుతో అతని వద్దకు:

అతని చెప్పిన చిరునామా ప్రకారం.. నిప్పో సెంటర్ వద్ద స్కూటీని నిలిపిన యువతి, ఆటోలో గాంధీబొమ్మ వరకు వెళ్లింది. ఆపై ఓ మొబైల్ దుకాణంలో రూ.30వేల విలువ చేసే శ్యామ్ సంగ్ ఫోన్ కొనుగోలు చేసింది. అక్కడినుంచి ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉండే రైల్వే బ్రిడ్డి వద్దకు చేరుకుంది. అప్పటికే అక్కడి వేచి చూస్తున్న అల్లాభక్షు.. యువతి ఫోటోలున్న పెన్ డ్రైవ్ ఆమెకు ఇచ్చేసి డబ్బుతో ఉడాయించాడు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు:

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు:

ఇంట్లో డబ్బు మాయమడంతో యువతి ఫ్యామిలీ కంగారు పడింది. విషయమేంటా? అని ఆరా తీస్తే ఆమె అసలు నిజం చెప్పేసింది. దీంతో యువతి కుటుంబసభ్యులు స్థానిక పోలీసులు దీనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
Nellore police filed a case on Allabhakshu who is blackmailed a teenage girl with her private photos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X