హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ ఇచ్చి టెక్కీ ఐఫోన్ చోరీ: మరో టెక్కీ బైక్‌కు మంటలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిసిఎస్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు డ్రగ్స్ ఇచ్చి అతని ఐఫోన్‌ను ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన హైదరాబాదులోని అఫ్జల్‌గంజ్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి జరిగింది. మెగల్‌పురాలోని తన ఇంటికి వెళ్లడానికి మొహ్మద్ ముస్తాఫా అఫ్జల్‌గంజ్ బస్టాండులో ఆగాడు.

ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని వద్దకు వచ్చి తనను రక్షణ శాఖ అధికారికి చెప్పుకుని - తనకు 50 వేల రూపాయలు ఇస్తే సైన్యంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. తనకు ఇది వరకే ఉద్యోగం ఉందని, మరో ఉద్యోగం అక్కర్లేదని ముస్తాఫా చెప్పాడు. ఆ తర్వాత ముస్తాఫాకు అతను ఓ చాక్‌లెట్ ఇచ్చాడు. ఆ చాక్‌లెట్ తిని ముస్తాఫా స్పృహ కోల్పోయాడు.

బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ముస్తఫా సోదరుడు బషీర్‌కు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అతని సోదరుడికి గాయాలు అయ్యాయని, నడవలేకపోతున్నాడని ఆ వ్యక్తి ముస్తాఫా గురించి బషీర్‌కు చెప్పాడు.

Man drugs techie, steals iPhone

బాధితుడు తన బ్యాగ్‌ను కూడా కోల్పోయినట్లు తెలుస్తోంది. అందులో కొన్ని పత్రాలు, ఎటిఎం కార్డు వంటివి కూడా ఉన్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మంటల్లో టెక్కీ బైక్

ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బైక్‌కు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడానికి అతను హైదరాబాదులోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద బైక్ ఆపాడు. ఆ సమయంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. మంటలను ఆర్పడానికి ఫైర్ టెండర్ వచ్చింది.

రవీందర్ రెడ్డి అనే టెక్కీ మాదాపూర్ నుంచి అమీర్‌పేటకు బైక్‌పై వెళ్తున్నాడు. అతను బైక్‌ను ఆపి మొబైల్‌లో మాట్లాడుతుండగా కాలుతున్న వాసన వచ్చింది. ఇంజన్ కాలుతున్నట్లు అతను గుర్తించాడు. నీళ్లతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది.

English summary
A TCS software engineer was drugged and robbed of his iPhone at Afzalgunj bus stand on Wednesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X