వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌పై దండయాత్ర: మందకృష్ణ, మోత్కుపల్లి బస్సు యాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ఉపముఖ్యమంత్రి టి. రాజయ్యను అవమానకరంగా పదవి నుంచి తొలగించినందుకు నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో ఆయన ఆ విషయం చెప్పారు. కేసీఆర్‌ అహంకారపూరిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని అన్నారు.

తెలంగాణలో అత్యధిక స్థానంలో ఉన్న మాదిగలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మాదిగ, మాలలు లేని మంత్రివర్గం ఒక్క కేసీఆర్‌దేనని మందకృష్ణ విమర్శించారు. కేసీఆర్‌కు వ్యతిరేక పోరాటంపై శుక్రవారం వరంగల్‌లో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

Mandakrishna says danda yatra against KCR

దళితులు లేని కేబినెట్‌ కే సీఆర్‌దేనని మందకృష్ణమాదిగ ఆరోపించారు. రాజయ్యను అవమానకరంగా తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాంస్కృతిక శాఖలోను దళితులకు ప్రాధాన్యం లేదని మంద కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలో బస్సుయాత్ర చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కేబినెట్‌లో దళితులకు చోటు కల్పించకపోవడం, ఏ తప్పూ చేయని రాజయ్యను బర్త్‌రఫ్‌ చేయడం వంటి కేసీఆర్‌ చర్యలకు నిరసనగా, దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా మోత్కుపల్లి బస్సుయాత్ర చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

English summary
MRPS founder president Manda Krishna Madiga stated that he will launch Danda yatra against Telangana CM K Chandrasekhar Rao's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X