వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ హైకమిషనర్‌తో కవిత, బీజేపీపై మంత్రి పవర్ ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితను బ్రిటీష్ డిప్యూటీ హై కమీషన్ అధికారుల బృందం సోమవారం కలిసింది. లండన్‌లోని ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజీ నవంబర్ రెండు నుంచి పది వరకు నిర్వహించే సదస్సుకు కవిత హాజరవుతున్నారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Met British Deputy High Commissioner Mr. Andrew McAllister at my residence yesterday. <a href="http://t.co/dyKhLWRGyv">pic.twitter.com/dyKhLWRGyv</a></p>— Kavitha Kalvakuntla (@RaoKavitha) <a href="https://twitter.com/RaoKavitha/status/524387029769920512">October 21, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

ఈ సందర్భంగా బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ అండ్య్రూ మెక్ అల్టిస్టర్ కవితను కలిశారు. రాజకీయ, పారిశ్రామిక, పర్యాటక అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాల గురించి కవిత వివరించారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, పారిశ్రామిక వేత్తలతో ప్రభుత్వం స్నేహ పూర్వక సంబంధాన్ని కొనసాగిస్తుందని కవిత అన్నారు.

బ్రిటీష్ వాణిజ్య, పెట్టుబడుల ప్రత్యేక కార్యాచరణ అధికారి అరుణ్ పిళ్లే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ఇనుమడింపజేస్తూ తెలంగాణ వ్యాప్తంగా పరిశ్రమ స్థాపనకు గల అవకాశాలను కవిత వివరించారు. హైదరాబాద్ సందర్శించే విదేశీ పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్టు చెప్పారు.

 Met British Deputy High Commissioner at my residence yesterday, Says Kavitha

చంద్రబాబుపై ఈటెల ఆగ్రహం

తెలంగాణకు వచ్చే విద్యుత్ వాటాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం అన్నారు. తెలంగాణ సర్కారు పైన అనవసరంగా టీడీపీ నేతలు బురద జల్లుతున్నారన్నారు. శ్రీశైలంలో నిబంధనలకు లోబడే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ టీడీపీ నేతలను చరిత్ర క్షమించదన్నారు.

బీజేపీ రెండో కారణం: జగదీశ్వర్ రెడ్డి ట్విస్ట్

తెలంగాణలో విద్యుత్‌కు భారతీయ జనతా పార్టీ రెండో కారణం అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి బాంబు పేల్చారు! విద్యుత్ కష్టాలకు తొలి కారణం టీడీపీ అయితే, రెండో కారణం బీజేపీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పంటను కాపాడేందుకు రూ.14 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు.

విద్యుత్ విషయంలో తమ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్న తెలంగాణ బీజేపీ నేతలు వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని హితవు పలికారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే నీరు నిల్వ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Met British Deputy High Commissioner Mr Andrew McAllister at my residence yesterday, Says Kavitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X