హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక ట్యాబ్లెట్ల చదువులు: శ్రీచైతన్యతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ.. భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. దేశీయంగా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది చివరి నాటికి దక్షిణ భారతంలో ఒకటి, ఉత్తర ఇండియాలో రెండు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రమాణిక్ చెప్పారు.

భావితరాలకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యను అందించాలనే ఉద్దేశంతో సంస్థ తొలిసారిగా ఎడ్యుకేషన్-క్లౌడ్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. వీటిద్వారా స్కూళ్లలో ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లలో సాంకేతిక టెక్నాలజీ ద్వారా విద్యను అందించేందుకు వీలు పడనుంది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఏ సమయంలోనైనా, ఎక్కడినుంచైనా సులభంగా నేర్చుకోవచ్చు. ఈ సర్వీసులను అందించడానికి సంస్థ తొలిసారిగా హైదరాబాద్‌కు చెందిన శ్రీచైతన్య స్కూల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఒప్పందంలో భాగంగా మొదటి దశలో హైదరాబాద్‌, బెంగళూరుల్లోని 80 శ్రీ చైతన్య పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. కంటెంట్‌ను శ్రీ చైతన్య సమకూరిస్తే.. క్లౌడ్‌ సేవల ద్వారా దాన్ని విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ అందిస్తుంది. ఈ సేవలను వినియోగించుకోవడానికి అవసరమైన ట్యాబ్లెట్‌ పీసీలను కూడా మైక్రోసాఫ్టే సమకూరుస్తుంది.

మొదటి దశలో శ్రీ చైతన్య విద్యార్థులు, ఉపాధ్యాయులు విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేసే 14,000 టాబ్లెట్‌ పీసీలను పొందుతారు. ఇది పూర్తిగా వార్షిక రుసుము ఆధారిత సేవ. విద్యార్థులు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను ఎడ్యు-క్లౌడ్‌ పెంచుతుందని, విద్యార్థులు టాబ్లెట్‌ లేదా మరే ఇతర కంప్యూటింగ్‌ పరికరంతోనైనా ఈ సేవలను పొందవచ్చని ప్రామాణిక్‌ వివరించారు. డిజిటల్‌ టెక్నాలజీతో బోధన, అభ్యాసన మారిపోతోందని, 21 శతాబ్దపు నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి డిజిటల్‌ లెర్నింగ్‌ తమ విద్యార్థులకు దోహదం చేయగలదని శ్రీ చైతన్య స్కూల్స్‌ వ్యవస్థాపకులు బి.ఎస్‌.రావు తెలిపారు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3వ, 4వ, 5వ తరగతులకు క్లౌడ్ ఆధారిత డిజిటల్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. వచ్చే మూడేళ్లలో అన్ని క్లాస్‌లకు ఈ సర్వీసులు అనుసంధానం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. వీటికోసం విద్యార్థులు రూ.11 వేల ధర కలిగిన ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్‌లో మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసి ఉండటంతో నేరుగా విద్యార్థులకు చదువు కొవడానికి సులభంగా ఉండనుంది.

ఇక ట్యాబ్లెట్ల చదువులు

ఇక ట్యాబ్లెట్ల చదువులు

సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ.. భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.

ఇక ట్యాబ్లెట్ల చదువులు

ఇక ట్యాబ్లెట్ల చదువులు

దేశీయంగా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది చివరి నాటికి దక్షిణ భారతంలో ఒకటి, ఉత్తర ఇండియాలో రెండు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రమాణిక్ చెప్పారు.

ఇక ట్యాబ్లెట్ల చదువులు

ఇక ట్యాబ్లెట్ల చదువులు

భావితరాలకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యను అందించాలనే ఉద్దేశంతో సంస్థ తొలిసారిగా ఎడ్యుకేషన్-క్లౌడ్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది.

ఇక ట్యాబ్లెట్ల చదువులు

ఇక ట్యాబ్లెట్ల చదువులు

వీటిద్వారా స్కూళ్లలో ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లలో సాంకేతిక టెక్నాలజీ ద్వారా విద్యను అందించేందుకు వీలు పడనుంది.

ఇక ట్యాబ్లెట్ల చదువులు

ఇక ట్యాబ్లెట్ల చదువులు

ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఏ సమయంలోనైనా, ఎక్కడినుంచైనా సులభంగా నేర్చుకోవచ్చు.

English summary
Microsoft India, has formally announced the launch of its latest cloud computing-based service ‘Edu-Cloud’ at Sri Chaitanya Group of Schools, here on Tuesday. This service is aimed at enhancing digital learning and teaching in schools and higher educational institutions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X