నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి నారాయణ కుమారుడి మృతదేహం నెల్లూరుకు తరలింపు, రేపు అంత్యక్రియలు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌‌ మృతదేహాన్ని స్వస్థలం నెల్లూరు తరలించారు. అపోలో ఆస్పత్రిలో నిశిత్‌ మృతదేహానికి వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌‌ మృతదేహాన్ని స్వస్థలం నెల్లూరు తరలించారు. అపోలో ఆస్పత్రిలో నిశిత్‌ మృతదేహానికి వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

అనంతరం అంబులెన్స్‌లో బంధువులు మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు. నిశిత్‌ తండ్రి నారాయణ లండన్‌ నుంచి బయలుదేరారని.. ఈ రాత్రికి చెన్నైకి చేరుకుంటారని వారి బంధువులు చెబుతున్నారు.

Minister Narayana's Son Dead Body shifted to Nellore, Funerals will be done on Tomorrow

ఏపీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్‌రావు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఐ నేత నారాయణ, తెరాస నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.శ్రీనివాస్‌, తెలంగాణ తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎల్‌.రమణ తదితరులు అపోలో ఆస్పత్రిలో నిషిత్‌‌ మృతదేహానికి నివాళులర్పించారు.

బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌ నారాయణ(22), అతడి స్నేహితుడు రవివర్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రయాణిస్తున్న బెంజ్‌ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నిశిత్‌ అంత్యక్రియలు గురువారం నెల్లూరులోని నారాయణ కళాశాల క్యాంపస్‌లో నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.

English summary
Andhra Pradesh Minister Dr P Narayana's son Nishith dead body shifted to his native place Nellore. Nishith and his friend Raja Ravi Chandra died in a road mishap in Hyderabad in the early hours of Wednesday. After postmartam the doctors of the Apollo Hospital handoverd his dead body to the relatives. Nishith's funerals will be done on tomorrow at Narayana College Campus, Nellore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X