అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ బాధేంటో నాకు తెలుసు, ప్రసన్నకు అండగా ఉంటా: మంత్రి పరిటాల సునీత

కుటుంబాన్ని పోగొట్టున్న బాధితురాలి ఆవేదన ఏంటో మహిళగా తనకు తెలుసునని , ఆమెకు కుటుంబసభ్యురాలిగా అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తాడిపత్రి: కుటుంబాన్ని పోగొట్టున్న బాధితురాలి ఆవేదన ఏంటో మహిళగా తనకు తెలుసునని , ఆమెకు కుటుంబసభ్యురాలిగా అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు.

తాడిపత్రి పట్టణంలోని క్రిష్ణాపురం మూడోరోడ్డుకు చెందిన ప్రసన్న తండ్రి రామసుబ్బారెడ్డి, భార్య, ఇద్దరు కుమార్తెలను హతమార్చాడు. దీంతో ప్రసన్న అనాధగా మిగిలింది. గురువారం నాడు మంత్రి పరిటాల సునీత ... బాధితురాలు ప్రసన్నను పరామర్శించారు.

 Minister Paritala Sunitha distributes to Prasanna Rs. 2 lakh

తాను భర్తను పోగొట్టుకొన్నందుకు ఎంత బాధపడుతున్నానో తెలుసునని, అలాంటింది తల్లి, తండ్రి చెల్లెళ్ళను పొగొట్టుకొని అనాధగా మిగిలిన ప్రసన్న ఎంతో కుంగిపోతోందన్నారామె.

ప్రసన్నను అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయాలని చెప్పారు. ఆర్థిక భద్రతలో భాగంగా వారి కుటుంబానికి ఉన్న 18 ఎకరాల పొలాన్ని ప్రసన్న పేరుమీద రాయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అప్పులు ఇచ్చినవారు మానవతా దృక్పథంలో ప్రసన్నను ఒత్తిడి చేయరాదని కోరారు.

Recommended Video

YS Jagan stops AP Investments : Paritala Sunitha

చంద్రబాబునాయుడు ప్రకటించిన రూ.20 లక్షలతో పాటు పరిటాల మోమోరియల్ ట్రస్ట్ ద్వారా రూ.2 లక్షల చెక్కును ప్రసన్న కలెక్టర్ పేరుతో జాయింట్ అకౌంట్ చేయనున్నట్టు చెప్పారు.బాధితురాలికి ఏ కష్టమెచ్చినా ఆదుకొనేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు.

English summary
Ap minister Paritala Sunita visited Prassanna house in Tadipatri town at Anantapur district on Thursday.Minister distributed to prasanna Rs.2 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X