వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్‌కు ప్రశాంత్ కిషోర్ కంటే ఆ అవసరం ఉంది, రాజారెడ్డి మార్క్ పాలిటిక్స్'

వైసిపి అధినేత వైయస్ జగన్‌కు నంద్యాలలో ఓటమి భయం పట్టుకుందని, అందుకే వరుసగా ఇక్కడే తిష్ట వేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: వైసిపి అధినేత వైయస్ జగన్‌కు నంద్యాలలో ఓటమి భయం పట్టుకుందని, అందుకే వరుసగా ఇక్కడే తిష్ట వేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.

జగన్ కోసం.. తీగ లాగితే: బాబుకు అడ్డంగా దొరికిన ప్రశాంత్ కిషోర్జగన్ కోసం.. తీగ లాగితే: బాబుకు అడ్డంగా దొరికిన ప్రశాంత్ కిషోర్

ఉప ఎన్నికకు కూడా జగన్ రెండు మూడు రోజులు కాకుండా జిల్లా నాయకుడిలా పర్యటిస్తున్నాడంటే జగన్‌కు కచ్చితంగా ఓటమి భయం పట్టుకున్నట్లేనని స్పష్టం చేశారు.

రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఒత్తిడిలో

రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఒత్తిడిలో

నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డితో కలిసి మంత్రి కాల్వ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాల్చివేత వ్యాఖ్యలపై ఈసికి జగన్‌ ఇచ్చిన వివరణపై మాట్లాడుతూ.. తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఒత్తిడిలో అలా మాట్లాడారన్నారు. తన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణలు చెబితే హుందాగా ఉంటుందన్నారు.

Recommended Video

YS Jagan Shock To Bhuma Akhila Priya
జగన్‌లో పశ్చాత్తాపం లేదు

జగన్‌లో పశ్చాత్తాపం లేదు

కాల్చివేత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి జగన్ ఇచ్చిన వివరణలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించటం లేదని మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, ప్రత్తిపాటి పుల్లారావులు వేరుగా అన్నారు. జగన్‌ ఇచ్చిన వివరణపై ఎన్నికల సంఘం స్పందించాలని, ఎటువంటి పరివర్తన కనిపించన్నారు. జగన్ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు.

జగన్‌కు ప్రశాంత్ కిషోర్ కంటే సైక్రియాటిస్టుల అవసరం

జగన్‌కు ప్రశాంత్ కిషోర్ కంటే సైక్రియాటిస్టుల అవసరం

నంద్యాలలో జగన్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు ప్రశాంత్‌ కిషోర్‌ వంటి రాజకీయ సలహాదారులు కాదు,సైక్రియాటిస్టులు అవసరమని తెలుస్తోందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉంటూ సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు.

ప్రతిపక్ష నేతనా, రాజారెడ్డి వారసుడా?

ప్రతిపక్ష నేతనా, రాజారెడ్డి వారసుడా?

చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలను ఆవేదనతో చేశానని జగన్‌ చెప్పటం సిగ్గుచేటు అన్నారు. తప్పు చేశాననే బాధ ఆయనలో ఇసుమంతైనా కనబడటం లేదన్నారు. ఒక మనిషిలోని రాక్షసత్వానికి ఇది నిదర్శనమన్నారు. జగన్‌ అసలు ప్రతిపక్ష నాయకుడా? లేక రాజారెడ్డి నేరాలకు వారసుడా? అని ప్రశ్నించారు.

కాల్చి చంపటం.. వైయస్ రాజారెడ్డి మార్క్ పాలిటిక్స్

కాల్చి చంపటం.. వైయస్ రాజారెడ్డి మార్క్ పాలిటిక్స్

తమ దోపిడీకి అడ్డువచ్చిన వారిని హతమార్చటం కాల్చి చంపటం వైయస్ రాజారెడ్డి మార్క్‌ రాజకీయమని, తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నంద్యాలలో తనలోని నేర స్వభావాన్ని బయటపెట్టుకున్నారని కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. జగన్‌ సన్నిహితులు, స్నేహితులు అంతా నేరస్తులేనని, ఈ ప్రాంత అభివృద్ధి, ప్రశాంత నంద్యాల కోసం ప్రజలు వైసిపిని చిత్తుగా ఓడించాలన్నారు.

English summary
Ministers Kalva Srinivasulu, Devineni Umamaheswara Rao, KE Krishna Murthy lashed out at YSR Congress Party chief YS Jaganmohan Reddy for his serial tour in Nandyal. Ministers said YS Jagan is following his grand father Raja Reddy's faction politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X