విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చూస్తూ ఊరుకోం: రోజాకు అనిత హెచ్చరిక, బుట్టా రేణుకపై ఇలా, ‘రోజా కంటతడి’

మహిళా పార్లమెంటేరియన్ సదస్సును అడ్డుకుంటామంటే చూస్తూ కూర్చోమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: మహిళా పార్లమెంటేరియన్ సదస్సును అడ్డుకుంటామంటే చూస్తూ కూర్చోమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సదస్సును అడ్డుకుంటారనే రోజాను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.

మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రోజాను.. శనివారం పోలీసులు అడ్డుకుని.. పేరచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు రోజా.

దమ్మున్న మగడేనా?: చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు(వీడియో)దమ్మున్న మగడేనా?: చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు(వీడియో)

ఈ నేపథ్యంలో రోజాపై ఎమ్మెల్యే అనిత తీవ్రంగా మండిపడ్డారు. దేశ విదేశాల నుంచి మహిళా ప్రతినిధులు వస్తే.. సదస్సును అడ్డుకుంటామని అనడం సరికాదని హితవు పలికారు. రోజా చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

మంచి కార్యక్రమాలను చెడగొడతామంటే సహించేది లేదని అనిత హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బుట్టా రేణుక సదస్సుకు వచ్చారని.. పద్ధతిగా మాట్లాడారని చెప్పారు. ఆమెను ఎవరూ అడ్డుకోలేదే? అంటూ అంటూ రోజాను ఉద్దేశించి అన్నారు.

Telugudesam Party MLA Anitha on Saturday fired at YSR Congress Party MLA RK Roja.

సదస్సులో గలాట చేస్తామంటే మేమెలా ఊరుకుంటామని అన్నారు. సదస్సుకు ఆహ్వానం అందగానే సదస్సును డిస్టర్బ్ చేసేందుకు రోజా పూనుకున్నారని అన్నారు. జనవరి 26న విశాఖలో ఆందోళన చేపట్టడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. రోజా ట్రాక్ రికార్డేమిటో అందరికీ తెలిసిందేనని అన్నారు. మహిళలకు టీడీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు ముళ్లపూడి రేణుక. సదస్సుపై చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని రోజా మండిపడ్డారు. సదస్సులో ఎలాంటి గొడవ చేయనని రోజా చెబితే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

సొమ్మసిల్లిని రోజా: రోజా కంటతడి

గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఎమ్మెల్యే రోజాను గుంటూరు జిల్లా మేడీకొండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, పేరేచర్ల వద్ద పోలీసు వాహనం దిగేందుకు ప్రయత్నించిన రోజాను.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోజా కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె సొమ్మసిల్లినట్లు తెలిసింది. దీంతో ఆమెను మేడికొండూరు పీఎస్‌కు తరలించారు.

English summary
Telugudesam Party MLA Anitha on Saturday fired at YSR Congress Party MLA RK Roja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X