వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీన్ రివర్స్: అప్యాయంగా పలకరించుకున్న ఎమ్మెల్యే చింతమనేని, వనజాక్షి!

తాజాగా ఎమ్మెల్యే, ఎమ్మార్వో మధ్య చోటు చేసుకున్న సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది.చింతమనేని ప్రభాకర్, వనజాక్షిలు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకోవడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: గతంలో ఇసుక తరలింపును అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి కూడా చేశారని ఆరోపించిన ఎమ్మార్వో.. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు.

వనజాక్షిపై చింతమనేని దాడి: ఏపీ ప్రభుత్వానికి హెచ్చార్సీ నోటీసులువనజాక్షిపై చింతమనేని దాడి: ఏపీ ప్రభుత్వానికి హెచ్చార్సీ నోటీసులు

అయితే, తాజాగా ఎమ్మెల్యే, ఎమ్మార్వో మధ్య చోటు చేసుకున్న సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది.చింతమనేని ప్రభాకర్, వనజాక్షిలు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకోవడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

MLA chintamaneni Prabhakar greeted MRO Vanajakshi

వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు బాల సదనం హాస్టల్‌ను గురువారం సందర్శించిన ఎమ్మార్వో.. హాస్టల్లోని మేఘన అనే బాలికను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతమనేని కూడా హాజరయ్యారు.

ముందుగా ఆయన వనజాక్షికి అప్యాయంగా స్వాగతం పలికారు. అనంతరం చింతమనేనికి వనజాక్షి పూల బొకే ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగానే అప్పటి గొడవ జరిగిందని, ఆ గొడవను మర్చిపోయామని వనజాక్షి తెలిపారు. మేమిద్దరం దాయాదులం, శత్రువులం కాదని స్పష్టం చేశారు.

English summary
MLA Chintamaneni Prabhakar on Thursday greeted MRO Vanajakshi an event held in Denduluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X