వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'క్షమాపణ కోరేముందు.. ప్రవర్తన గుర్తు తెచ్చుకోండి.. అలా చేస్తే నేనూ వస్తా'

సీఎం చంద్రబాబు ఇంటి వద్ద వసతులు లేక ఎండలో మగ్గుతున్న పోలీసులు నిరసన తెలపాలని సూచించారు. వారి సమస్యలపై పోరాడేందుకు పోలీస్ సంఘం సిద్దమైతే..

|
Google Oneindia TeluguNews

తిరుమల: ప్రభుత్వానికి తనకు మధ్య పోరులో పోలీసులు వచ్చి దూరినట్లయింది ఎమ్మెల్యే రోజా పరిస్థితి. అసలు విషయం పక్కకు పోయి పోలీస్ శాఖ, రోజా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు.

ఏపీ డీజీపీ సాంబశివరావు సీఎం చంద్రబాబుకు బానిసలా పనిచేస్తున్నారని రోజా చేసిన వ్యాఖ్యలను పోలీసు వర్గాలు తప్పుపట్టాయి. అంతేకాదు మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రోజాపై వారు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఎవరికీ బానిసలు కారని, చట్టానికి మాత్రమే బానిసలని కౌంటర్ కూడా ఇచ్చారు. తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

MLA RK Roja respon on andhrapradesh police officers association demand

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా పోలీసులు చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. ఒత్తిడికి తలొగ్గి పనిచేయాల్సి వస్తోందని పోలీసులు చెప్పడం బాధాకరమన్నారు. తనను క్షమాపణ చెప్పమని అడిగేముందు ఒక్కసారి వారు ప్రవర్తించిన తీరును గుర్తుచేసుకోవాలని అన్నారు. గన్ మెన్స్ ను నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలనడం సరికాదన్నారు.

అదే సమయంలో పోలీస్ సమస్యలపై పోరాడాల్సిందిగా పోలీస్ సంఘానికి రోజా హితవు పలికారు.
సీఎం చంద్రబాబు ఇంటి వద్ద వసతులు లేక ఎండలో మగ్గుతున్న పోలీసులు నిరసన తెలపాలని సూచించారు. వారి సమస్యలపై పోరాడేందుకు పోలీస్ సంఘం సిద్దమైతే.. పోరాటంలో తాను కలిసి వస్తానని అన్నారు.

పుష్కరాల సమయంలో అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోతే తప్పంతా పోలీసులదే అన్న చంద్రబాబును ఏపీ పోలీసుల సంఘం ఎందుకు ప్రశ్నించలేకపోయిందని రోజా నిలదీశారు.
మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. అసెంబ్లీలోకి రానివ్వకుండా తనకెవరైనా అడ్డుపడితే వారికి తగిన రీతిలో సమాధానమిస్తానని రోజా తెలిపారు.

English summary
Yesterday AP Police association was demanded MLA Roja to say sorry for them. Today Roja was reponded on their demand, just she refused for that
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X