వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బాబు వస్తే జాబు వస్తుందనుకున్నాం.. లోకేష్‌కు ఎమ్మెల్సీ వస్తుందనుకోలేదు'

బాబు వస్తే జాబు వస్తుందంటే ఏమో అనుకున్నామని.. కానీ చంద్రబాబు వాళ్ల బాబు లోకేష్ కు ఎమ్మెల్సీ సీటు వస్తుందని అనుకోలేదని ఎద్దేవా చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షం వైసీపీ పెదవి విరుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల మీద ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను సీఎం చంద్రబాబు నెరవేర్చడం లేదని రోజా మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనలో విఫలమైతే నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ హామిని గాల్లో కలిపేసిందని విమర్శించారు.

MLA Roja criticizes Chandrababu Naidu over AP budget

బాబు వస్తే జాబు వస్తుందంటే ఏమో అనుకున్నామని.. కానీ చంద్రబాబు వాళ్ల బాబు లోకేష్ కు ఎమ్మెల్సీ సీటు వస్తుందని అనుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రతీ బడ్జెట్ లో రెండు లక్షల ఇళ్లు కేటాయిస్తామని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం.. బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం అందుకు నిధులు కేటాయించడం లేదని నిలదీశారు.

రాష్ట్రంలో మహిళారక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, బడ్జెట్ లోను కేటాయింపులు జరపలేదని అన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి చంద్రబాబు మహిళలను మభ్యపెడుతున్నారని రోజా స్పష్టం చేశారు.

English summary
YSRCP MLA Roja criticized CM Chandrababu Naidu and his govt over AP Budget 2017-18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X