అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి నిర్మాణానికి సహకరించండి: సింగపూర్‌లో మోడీ, చాయ్‌వాలా చెప్తే...

By Pratap
|
Google Oneindia TeluguNews

సింగపూర్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరించాలని సింగపూర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. సింగపూర్‌ ప్రధాని లీతో మోదీ భేటీ అయ్యారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని, దాన్ని సింగపూర్‌లా అభివృద్ధి చేయాలని కోరారు. భారతలో సింగపూర్‌ తరహా నగరాలను చాలా నిర్మించాల్సి ఉంటుందని అన్నారు. దేశంలో కనీసం 20 స్మార్ట్‌ సిటీలను నిర్మించాలని మోడీ కోరారు. పెట్టుబడులు పెట్టాలంటూ సింగపూర్‌ పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు.

ప్రపంచమంతా ఒకే కుటుంబమని, భారత వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని, సింగపూర్‌ అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని ప్రధాని అన్నారు. సింగూర్‌ పర్యటనలో ఉన్న ఆయన రెండో రోజైన మంగళవారం ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. 50 ఏళ్లలో సింగపూర్‌ స్వరూప స్వభావాలు మార్చేశారని అన్నారు.

Narendra Modi

భారత అతి పెద్ద దేశమైనప్పటికీ సింగపూర్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన అన్నారు. ప్రజలంతా కష్టపడి సింగపూర్‌ను గొప్ప దేశంగా మలిచారని, ప్రపంచమంతా మారుతోందనిస భారత మారాలా? వద్దా? అని మోడీ ప్రశ్నించారు. మోదీ సభకు సుమారు ఐదు వేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు.

భారత్‌లో ఒకప్పుడు పక్క కుర్చీ కూడా వదలకూడదని అనుకునేవాళ్లు, ఇప్పుడు సబ్సిడీలను కూడా వదులుకుంటున్నారని మోడీ అన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చెప్తే చేయడం కాదు... మామూలు చాయ్‌ అమ్ముకునేవాడు చెప్పినా చేశారని ఆయన అన్నారు. మనదేశం అభివృద్ధి చెందాలని ప్రతి భారతీయుడు అనుకుంటున్నాడని ఆయన అన్నారు.

English summary
PM Narendra Modu urged the Singapore to build Amaravati capital of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X