తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌పై యుద్ధం ప్రకటించా: మోత్కుపల్లి ఉద్వేగం, రాజ్యసభ సీటుపై గురి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తిరుపతి: నేను పడిన కష్టాన్ని అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ గుర్తించాలని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. తెలుగుదేశం పార్టీ తిరుపతిలో నిర్వహిస్తున్న పసుపు పండుగ 'మహానాడు' కార్యక్రమంలో రెండో రోజు ఆయన ఉద్వేగ ప్రసంగం చేశారు.

ఎవరూ కేసీఆర్‌ను విమర్శించని సమయంలో తాను ఆయనపై యుద్ధం ప్రకటించానని మహానాడులో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని పరోక్షంగా సూచించారు. ఈ ఐదేళ్లలో మోత్కుపల్లి పడిన కష్టాన్ని అధినేత చంద్రబాబుకు వివరించారు.

తాను పడిన కష్టాన్ని పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించాలని అన్నారు. తాను తెలంగాణ వాడిని అనుకుంటే తెలంగాణ వాడనని, ఆంధ్రా వాడినని అనుకుంటే ఆంధ్రావాడినని చెప్పుకొచ్చారు. తనకు ప్రాంతంతో సంబంధం లేదని అన్నారు.

motkupalli narasimhulu Emotional speech in mahanadu at tirupati

నాకు పార్టీయే ముఖ్యమని, చివరి నిమిషం వరకు టీడీపీలోనే ఉంటానని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు మంచి మిత్రుడని అన్నారు. దొరలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తెలంగాణలో బడుగులకు నాయకత్వం అప్పగించాలని సూచించారు.

ఎందరో బడుగులను నేతలుగా ఎన్టీఆర్ తీర్దిదిద్దారు
తెలుగు రాష్ట్రాల్లో ఎందరో బడుగులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్ధిన ఘనత ఎన్టీఆర్‌దేనని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. తిరుపతిలో మహానాడులో శనివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బలహీనవర్గాలకు ఆయన విముక్తి కల్పించారని తెలిపారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టే సమయానికి అర్ధాకలితో, పూరి గుడిసెల్లో ఉన్న పేదలకు ఉన్నత జీవితాలు అందించారని అన్నారు.

కాంగ్రెస్ కాపులను ఓటు బ్యాంక్‌గా చూస్తోంది
కాంగ్రెస్ పార్టీ కాపులను ఓటు బ్యాంక్‌గానే చూసిందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్‌ ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. కాపు రిజర్వేషన్‌ విషయంలో రాజకీయ కుట్ర జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
Telanganan Tdp senior leader motkupalli narasimhulu Emotional speech in mahanadu at tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X