జగన్ పార్టీ డబ్బులు పంచుతూ, టీడీపీ అలా..: నంద్యాల పోటీపై బైరెడ్డి

Subscribe to Oneindia Telugu

కర్నూలు: తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం నాయకులు, డబ్బులు చూపి వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు పోటీ పడి ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

My party will contest from Nandyal in bypoll, says byreddy

ఆ పార్టీల దుర్మార్గపు రాజకీయాలను తిప్పికొట్టడానికి రాయలసీమ పరిరక్షణ సమితి అభ్యర్థిని నంద్యాల ఉప ఎన్నికలో నిలబెడుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రచారానికి ఖర్చు చేసిన ప్రతి పైసా లెక్క చూపిస్తామని బైరెడ్డి తెలిపారు.

English summary
Rayalaseema Parirakshana Samithi president Byreddy Rajasekhar Reddy on Sunday said that his party will contest from Nandyal in bypoll.
Please Wait while comments are loading...