విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా వ్యాఖ్యలతో పార్టీ ఇమేజ్ పెరిగింది.. గంటాకు అయ్యన్న కౌంటర్?, విభేదాలు లేవంటూనే..

తన వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ పెరిగింది తప్పితే తగ్గలేదన్నారు. విశాఖ భూవిదాంపై తాను స్పందించిన తర్వాతే సిట్‌ విచారణ వేశారని తెలిపారు. లబ్దిదారులకు న్యాయం జరగాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే తాము

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విశాఖ భూదందాలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని మంత్రి అయ్యన్న ఆరోపించడం.. పార్టీ ప్రతిష్ట దిగజారుస్తున్నారని ఆరోపిస్తూ మరో మంత్రి గంటా సీఎంకు లేఖ రాయడం.. విశాఖలో టీడీపీ లుకలుకలు బయటపడేలా చేసింది.

ఇంతలోనే అలాంటిదేమి లేదంటూ మంత్రి అయ్యన్న మీడియాకు వివరణ ఇచ్చుకోవడం.. అదే సమయంలో గంటాకు చురకలంటించేలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.గురువారం నాడు మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. విశాఖలో భూ వివాదాలు పరిష్కారం కావాలన్నదే తమ ఇద్దరిని అభిమతమని గంటాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

my statements on vizag land scam are used to increase govt prestige says ayyanannapatrudu

అదే సమయంలో పార్టీ ప్రతిష్టను దిగజార్చారన్న గంటా ఆరోపణను ఆయన అంగీకరించలేదు. తన వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ పెరిగింది తప్పితే తగ్గలేదన్నారు. విశాఖ భూవిదాంపై తాను స్పందించిన తర్వాతే సిట్‌ విచారణ వేశారని తెలిపారు. లబ్దిదారులకు న్యాయం జరగాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.

కాగా, గురువారం ఉదయం జరిగిన టీడీపీ సమన్వయ భేటీ సమావేశంలో విశాఖ భూముల వ్యవహారంపై మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులను సీఎం మందలించిన సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో పార్టీలో నెలకొన్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

English summary
Minister Ayyannapatrudu said his comments on Vizag land scam are increased govenoment prestige. On thursday, he made these comments at his office
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X