వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల ఉప ఎన్నిక జగన్ కు యాసిడ్ టెస్ట్

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ లాంటివని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల:నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ లాంటివని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక అధికార టిడిపికి, విపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారనుంది.మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరడం టిడిపికి కొంత నష్టమేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

<strong>అఖిలప్రియకు బాబు షాక్: మోహన్ రెడ్డిని కలుపుకొని వెళ్ళాల్సింది, వైసీపీ నుండి టిడిపిలోకి </strong>అఖిలప్రియకు బాబు షాక్: మోహన్ రెడ్డిని కలుపుకొని వెళ్ళాల్సింది, వైసీపీ నుండి టిడిపిలోకి

ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే నంద్యాలలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార,విపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. నంద్యాల స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలుపుకోసం రెండు పార్టీలు ఇప్పటినుండే వ్యూహలను సిద్దం చేస్తున్నాయి.

<strong>అభివృద్దికి శిల్పా అడ్డుపడ్డాడు, భూమావర్గంపై కేసులు: అఖిలప్రియ సంచలనం</strong>అభివృద్దికి శిల్పా అడ్డుపడ్డాడు, భూమావర్గంపై కేసులు: అఖిలప్రియ సంచలనం

శిల్పాతో ఆయన అనుచరులంతా పార్టీని వీడడంతో వైసీపీ ధీమాగా ఉంది. అయితే శిల్పా పార్టీ మారినంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీలేదని టిడిపి నాయకులు చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో టిడిపిలో చేరారు. అయితే భూమా మరణించడంతో ఆ కుటుంబం నుండి బ్రహ్మనందరెడ్డి బరిలోకి దిగే అవకాశాలున్నాయి.అయితే ఆనాడు భూమానాగిరెడ్డి ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు టిడిపి ప్రభుత్వం ఆఘమేఘాల మీద పనులను చేపట్టింది.

2019 ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్

2019 ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్

నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నిక 2019 సార్వత్రిక ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ లాంటివేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు ఈ ఎన్నికల్లో విజయం కోసం టిడిపి ప్రత్యేకంగా కేంద్రీకరించింది. భూమా నాగిరెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూమా అఖిలప్రియ నంద్యాల కేంద్రంగా అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ఈ నెల 21వ, తేదిన గృహనిర్మాణ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక ఏకపక్షం కాదా?

నంద్యాల ఉప ఎన్నిక ఏకపక్షం కాదా?

శిల్పామోహన్ రెడ్డి టిడిపిలో ఉన్నంతవరకు ఈ ఎన్నిక ఏకపక్షమనే అభిప్రాయం కూడ లేకపోలేదు.అయితే టిడిపి నుండి శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో ఉపఎన్నికలకు టిడిపి ఎదురీదక తప్పనిసరిపరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.మున్సిఫల్ కౌన్సిలర్లు, జడ్ పి టి సి సభ్యులు, ఎంపిపిలు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచ్ లతో కలిసి జగన్ సమక్షంలో శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నిక నుండి టిడిపి పతనం ప్రారంభంకానుందని శిల్పామోహన్ రెడ్డి ప్రకటించడం విశేషం.

నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కన్పిస్తోందా?

నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కన్పిస్తోందా?

నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వామపక్షాలు, వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.అయితే ఈ ఎన్నికల్లో బరిలో ఉండే అభ్యర్థుల ప్రభావం కూడ ఉపఎన్నికల్లో కన్పించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

గెలుపు ఓటములపై ప్రభావం చూపేది వీరే

గెలుపు ఓటములపై ప్రభావం చూపేది వీరే

నంద్యాల ఉప ఎన్నికలు అధికార టిడిపి, విపక్ష వైసీపీలకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ విజయం సాధిస్తే సమరోత్సాహంతో 2019 ఎన్నికల్లో పనిచేయనుంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే సార్వత్రిక ఎన్నికలు టిడిపికి అగ్నిపరీక్తే. నంద్యాలలో గెలుపు ఓటములు స్థానికంగా ఉన్న ముస్లిం మైనారిటీల మీద ఆధారపడి ఉంటుంది. 70 వేల ఓట్లు ముస్లిం మైనార్టీలకు ఉన్నాయి. వీరంతా ఎటూవైపు మొగ్గుచూపితే ఆ పార్టీకి ప్రయోజనం దక్కనుంది. మరో వైపు ఆ తర్వాతి స్థానంలో కాపులు, బలిజ ఓటర్లుంటారు. ఈ ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.

English summary
Nandyal bypoll result will reflects on 2019 elections expected political observers. Tdp and Ysrcp trying to win this seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X