వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెక్కలు తీసిన జగన్: చంద్రబాబు ఎత్తులపై ప్రశాంత్ కిషోర్ పైఎత్తు

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుపై వైసిపి, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. వారి నమ్మకానికి ఓట్ల లెక్కలే కారణం. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల లెక్కలతో వైసిపి ధీమాగా ఉందంటున్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుపై వైసిపి, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. వారి నమ్మకానికి ఓట్ల లెక్కలే కారణం. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల లెక్కలతో వైసిపి ధీమాగా ఉందంటున్నారు.

షాక్: అఖిలప్రియకు పవన్ కళ్యాణ్ 'నో'? చిరంజీవికే దూరం.. 'భూమా' ఎంత? షాక్: అఖిలప్రియకు పవన్ కళ్యాణ్ 'నో'? చిరంజీవికే దూరం.. 'భూమా' ఎంత?

ఓ వైపు ప్రచారంలో దూసుకుపోతూనే మరోవైపు ఎన్నికల్లో ఓట్ల లెక్కలను వేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. ఆయా సామాజిక వర్గాల ఓట్లు, సంఘాల ఓట్లపై నమ్మకం పెట్టుకున్నారు.

అక్కడ పట్టు కోసం

అక్కడ పట్టు కోసం

గత ఎన్నికల గణాంకాలను విశ్లేషించుకుని ఆ మేరకు టిడిపి, వైసిపిలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఏ ప్రాంతంలో వెనకబడ్డారో అక్కడ పట్టు సాధించడం కోసం, ఎక్కడ ఆధిక్యంలో ఉన్నారో అక్కడ పట్టు నిలుపుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Recommended Video

Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
భూమాకు మెజార్టీ.. ప్రశాంత్ సూచనలతో బాబుపై పైచేయి కోసం జగన్

భూమాకు మెజార్టీ.. ప్రశాంత్ సూచనలతో బాబుపై పైచేయి కోసం జగన్

గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన భూమా నాగి రెడ్డికి కేవలం మూడువేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ మెజార్టీలో అధిక శాతం అందించిన మండలం గోస్పాడు. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటనలో గోస్పాడుపై గురిపెట్టారు. మరోవైపు, ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు జగన్‌ కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు.

నాడు ఎవరికి ఎన్ని ఓట్లు అంటే

నాడు ఎవరికి ఎన్ని ఓట్లు అంటే

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో 2,42,742 మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఎన్నికల్లో 1,74,999 ఓట్లు పోలయ్యాయి. నాటి టిడిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి 78,590, నాటి వైసిపి అభ్యర్థి భూమా నాగిరెడ్డికి 82,194 ఓట్లు వచ్చాయి. 3,604 ఓట్లతో వైసీపీ అభ్యర్థి భూమా గెలుపొందారు. ఈ మెజార్టీ ఓట్లల్లో అత్యధికంగా గోస్పాడు మండలం నుంచే వచ్చినట్లు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థులు పార్టీలు మారాయి.

ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించేనా?

ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించేనా?

గోస్పాడు మండలంలోని 21 గ్రామాల పరిధిలో 28 వేల మంది ఓటర్లు ఉన్నారు. యాళ్ళూరులో ఆరు వేల ఓట్లు, దీబగుంట్లలో మూడువేలు, జిల్లెల్ల, గోస్పాడులలో మూడువేలకు పై చిలుకు, ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామాలపై రెండు పార్టీలు దృష్టి పెట్టాయి. నంద్యాల పట్టణంలో భారీ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పట్టణ ఓటర్లు సహజంగానే టిడిపి వైపు ఉంటారని వైసిపి భావిస్తోందని అంటున్నారు. అందుకే గోస్పాడుపై ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక దృష్టి సారించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరింత బలం పెంచుకోవడానికి ప్రశాంత్ వ్యూహాలను జగన్‌ అమలు చేస్తున్నారని అంటున్నారు.

అందుకే జగన్ వరుస ప్రచారం

అందుకే జగన్ వరుస ప్రచారం

అందులో భాగంగానే జగన్ తొలి విడత ప్రచారంలోనే గోస్పాడు మండలంలోని అన్ని గ్రామాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారని తెలుస్తోంది. దీబగుంట్లలో నాగిరెడ్డి గత ఎన్నికల్లో టిడిపి వైపు ఉండగా, ఇప్పుడు వైసిపిలో ఉన్నారు. దీంతో ఈసారి తమకు మెజార్టీ వస్తుందని వైసిపి లెక్కలు వేసుకుంది. గోస్పాడులో 3,200 ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో టిడిపికి మెజార్టీ వచ్చినా నాయకులు పార్టీ ఫిరాయించడంతో వైసిపికే అనుకూలంగా కనిపిస్తోందని అంటున్నారు. ఆరువేల ఓట్లు ఉన్న యాళ్ళూరులో గత ఎన్నికల్లో వైసిపికి ఆధిక్యం కనిపించింది.

దానిపైనే ఇరు పార్టీల గురి.. ప్రశాంత్ ఎత్తులు ఫలించేనా

దానిపైనే ఇరు పార్టీల గురి.. ప్రశాంత్ ఎత్తులు ఫలించేనా

అత్యధిక ఓటర్లు ఉన్నచోట అభివృద్ధి అజెండాగా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభివృద్ధి అజెండాగా ముందుకు పోతోంది. వైసిపి కూడా ధీటుగా వెళ్తోంది. ప్రధాన పార్టీలు గోస్పాడుపై గురిపెట్టడం గమనార్హం. నంద్యాలపై ఇప్పటికే సర్వే చేసి, పూర్తి వివరాలు జగన్‌కు ఇచ్చారని తెలుస్తోంది. దాని ప్రకారం జగన్‌ను ముందుకు నడిపిస్తున్నారు. దీంతో ప్రశాంత్ కిషోర్ ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలంటున్నారు. ఆయన సూచనతో జగన్ ప్రధానంగా గోస్పాడుపై దృష్టి సారించారంటున్నారు.

పట్టణంలో టిడిపి దూసుకెళ్లోందా?

పట్టణంలో టిడిపి దూసుకెళ్లోందా?

నంద్యాల నియోజకవర్గ పరిధిలో నంద్యాల అర్బన్‌, రూరల్‌, గోస్పాడు మండలాలు ఉన్నాయి. గోస్పాడు పరిధిలో 28 వేలు, నంద్యాల రూరల్‌ పరిధిలో 55 వేల ఓటర్లు ఉన్నారు. అధికంగా 1.35 లక్షల ఓటర్లు పట్టణంలో ఉన్నారు. ఈ ఓట్లపై టిడిపి పట్టు బిగుస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే రోడ్ల విస్తరణ, తాగునీటి పైపులైన్‌ నిర్మాణం, 13 వేల ఇళ్ల నిర్మాణం వంటి పథకాలను వివరిస్తూ అధికార పార్టీ ప్రచారంలో ముందుకెళ్తోంది. అయితే, ఉప ఎన్నికల నేపథ్యంలోనే ప్రజలు గుర్తుకు వచ్చారని వైసిపి కౌంటర్ ప్రచారం చేస్తోంది. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది.

జగన్ తర్వాత చంద్రబాబు

జగన్ తర్వాత చంద్రబాబు

ఈనెల 13న నంద్యాలలో జగన్‌ ఎన్నికల ప్రచార రోడ్డు షో నిర్వహించనున్నారు. నంద్యాల పట్టణ ఓటర్లను ఆకట్టుకునే దిశగా రోడ్డు షో ఉండనుందని అంటున్నారు. జగన్‌ పర్యటన తర్వాత ఈ నెల 19 నుంచి రెండు మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.

English summary
The Nandyal by election in Andhra Pradesh has turned into a prestige battle between Chief Minister N Chandrababu Naidu and YSR Congress Party leader YS Jagan Mohan Reddy who are going all out to win the seat at any cost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X