వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు 'పవన్ కళ్యాణ్' ఊరట, అఖిలప్రియ లెక్కలు తారుమారు, టిడిపికి ఇలా దెబ్బ

నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ ఇలాంటి ప్రకటననే చేస్తారని చాలామంది ముందే ఊహించారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ ఇలాంటి ప్రకటననే చేస్తారని చాలామంది ముందే ఊహించారు.

షాక్: అఖిలప్రియకు పవన్ కళ్యాణ్ 'నో'? చిరంజీవికే దూరం.. 'భూమా' ఎంత?షాక్: అఖిలప్రియకు పవన్ కళ్యాణ్ 'నో'? చిరంజీవికే దూరం.. 'భూమా' ఎంత?

అఖిలప్రియ ఆశలపై నీళ్లు చల్లిన పవన్ కళ్యాణ్

అఖిలప్రియ ఆశలపై నీళ్లు చల్లిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌కు తమ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని, కాబట్టి ఆయన తమకు మద్దతు పలుకుతారని మంత్రి అఖిలప్రియ, ఆమె సోదరి మౌనికా రెడ్డి ప్రకటిస్తూ వచ్చారు. కానీ వారు ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లారు.

అఖిలప్రియ లెక్కలు తారుమారు

అఖిలప్రియ లెక్కలు తారుమారు

గత అసెంబ్లీ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి కేవలం 3వేల పై చిలుకు ఓట్లతో మాత్రమే గెలిచారు. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ మద్దతు పలికితే.. కాపు ఓట్లు, యువత ఓట్లు తమకు వస్తాయని అఖిలప్రియ భావించారు. కానీ ఇప్పుడు పవన్ ఎవరికీ మద్దతివ్వకపోవడంతో కాపులు, యువత టిడిపి వైపు మాత్రమే ఉండే అవకాశాలు లేవు. పవన్ ప్రకటనతో అఖిలప్రియ లెక్కలు తారుమారయ్యాయని చెప్పవచ్చు.

టిడిపికి ఇలా దెబ్బ

టిడిపికి ఇలా దెబ్బ

నంద్యాలలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు నలభై వేలు ఉంటాయి. అలాగే జనసేనకు కూడా మంచి క్యాడర్ ఉంది. ఇప్పుడు వీరు తమ తమ ఇష్టానుసారంగా ఓటు వేస్తారు. పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు పలికితే.. దాదాపు పెద్ద మొత్తంలో ఓట్లు ఆ పార్టీకి పడతాయని అందరూ భావించారు.

జగన్‌కు ఊరట.. టిడిపికి దెబ్బ

జగన్‌కు ఊరట.. టిడిపికి దెబ్బ

పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతిస్తారేమోననే అందోళన వైసిపిలోను మొదటి నుంచి ఉంది. ఆయన టిడిపికి మద్దతిస్తే తమకు పెద్ద మొత్తంలో ఓట్లు తగ్గుతాయని లెక్కలు వేసుకున్నారు. కానీ ఆయన తాజా ప్రకటన జగన్‌కు, వైసిపికి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. అదే సమయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న టిడిపికి ఊహించని షాక్.

ఇదీ పవన్ కళ్యాణ్ లెక్క

ఇదీ పవన్ కళ్యాణ్ లెక్క

ప్రజల కోసం తాను సొంత అన్నయ్య చిరంజీవికే రాజకీయంగా దూరమయ్యానని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పారు. ఆయన అలా చెప్పినప్పుడే.. కేవలం కుటుంబ స్నేహం ఉన్నంత మాత్రాన భూమా కుటుంబానికి మద్దతిస్తారని చాలామంది భావించలేదు. కానీ అఖిలప్రియ, టిడిపి మాత్రం ఆశలు పెట్టుకున్నాయి.

జగన్ వ్యాఖ్యలు నిజం చేయకుండా

జగన్ వ్యాఖ్యలు నిజం చేయకుండా

పవన్ కళ్యాణ్ గత మూడేళ్లలో టిడిపి ప్రభుత్వాన్ని పలుమార్లు విమర్శించారు. కానీ చంద్రబాబుకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన తెరపైకి వస్తారని వైసిపి విమర్శించింది. మూడున్నరేళ్ల పాటు విమర్శలు చేసి ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో మద్దతిస్తే జగన్, వైసిపి నేతలు చేసిన విమర్శలు కూడా నిజమయినట్లుగా భావించవలసి ఉంటుంది. అందుకే ఆయన తటస్థం అని చెప్పారని అంటున్నారు.

భవిష్యత్తు కోసమూ

భవిష్యత్తు కోసమూ

ఇక, ఇప్పుడు టిడిపి, వైసిపిలకు మద్దతివ్వడం కన్నా 2019లో నేరుగా పోటీ చేయడమే మంచిదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇన్నాళ్లు పలు అంశాల్లో అధికార, విపక్షాలతో విభేదించి ఎన్నికలకు సంవత్సరంన్నర ముందు వారితో కలిసి, మళ్లీ 2019లో వారిని విమర్శించడం కంటే ఇప్పుడు తటస్థంగా ఉండటమే మంచిదని పవన్ భావించి ఉంటారని అంటున్నారు.

English summary
Pawan Kalyan took a neutral stand regarding Nandyal by-poll as he stated that his party won't be contesting, nor it would lend support to any party. Sending out this clear message, he posted video byte.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X