వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ తీరు మారకుంటే ఉద్యమమే: నన్నపనేని

|
Google Oneindia TeluguNews

గుంటూరు: వాహనాలకు రవాణా పన్నుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీరు మార్చుకోకపోతే ఉద్యమిస్తామని తెలుగుదేశం సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. పన్నుల విషయంలో కెసిఆర్‌ తీరుకు నిరసనగా అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని రాజకుమారి పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా మంగళవారం అర్ధరాత్రి నుంచి పన్నుల వసూలు ప్రారంభించారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా కోదాడ, నాగార్జునసాగర్‌ ప్రాంతాల నుంచి తెలంగాణలో ప్రవేశిస్తున్న ప్రైవేటు వాహనాల నుంచి పన్నులను వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 150 వాహనాల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Nannapaneni fires at KCR

అటు మహబూబ్‌నగర్‌ చెక్‌పోస్టులో రూ.61 లక్షల టాక్స్‌ వసూలు చేసిందిది. అయితే ఎప్పుడూ రద్దీగా ఉండే విజయవాడ- హైదరాబాద్‌ హైవేపై వాణిజ్య వాహనాల రాకపోకలు తగ్గాయి. ప్రైవేటు బస్సుల రాకపోకలు 80 శాతం నిలిచిపోయాయి.

మరోవైపు పన్ను వసూలుపై ఏపీ ప్రైవేటు బస్సు యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించాయి.

English summary
Telugudesam senior leader Nannapaneni Rajakumari on Wednesday fired at Telangana CM K Chandrasekhar Rao on issue of transport tax.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X