వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైల సంతకాలు తీసుకున్న లోకేష్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తన అమెరికా పర్యటనలో ఎన్నారైల మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఏపీ అభివృద్ధి కోసం పలువురు ఎన్నారైలు ముందుకు వస్తున్నారు. విశాఖను స్మార్ట్ సిటీగా చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు. అదేవిధంగా పలువురు తమ తమ ప్రాంతంలోని గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు.

మంగళవారం నాడు నారా లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ, ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ సెక్టార్‌కు చెందిన వారిని కలిశారు. ఇమాజినేషన్ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డను కలిశారు. ఈ సందర్భంగా విశాఖ అభివృద్ధి కోసం తన వంతు సాయం చేస్తానని లోకేష్‌కు కృష్ణ హామీ ఇచ్చారు.

ఫోటోలు : అమెరికాలో లోకేష్

ఓ సందర్భంలో లోకేష్ మాట్లాడుతూ.. తాను అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ కామెర్స్ అసిస్టెంట్ సెక్రటరీ అరుణ్ కుమార్‌‍ను కలిశానని, అలాగే భారత్‌కు చెందిన పలువురు ముఖ్య అధికారులను కలిశానని చెప్పారు. ఏపీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గురించి చెప్పానని అన్నారు.

ఎన్నారైలతో కలిసి విశాఖ, ఇతర నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఏపీని మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా చేస్తామన్నారు. కృష్ణ యార్లగడ్డ సానుకూలంగా స్పందించారని చెప్పారు.

నారా లోకేష్

నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తన అమెరికా పర్యటనలో ఎన్నారైల మద్దతును కూడగట్టుకుంటున్నారు.

 నారా లోకేష్

నారా లోకేష్

ఏపీ అభివృద్ధి కోసం పలువురు ఎన్నారైలు ముందుకు వస్తున్నారు. విశాఖను స్మార్ట్ సిటీగా చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు.

 నారా లోకేష్

నారా లోకేష్

అదేవిధంగా పలువురు తమ తమ ప్రాంతంలోని గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు.

 నారా లోకేష్

నారా లోకేష్

మంగళవారం నాడు నారా లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ, ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ సెక్టార్‌కు చెందిన వారిని కలిశారు.

 నారా లోకేష్

నారా లోకేష్

ఇమాజినేషన్ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డను కలిశారు. ఈ సందర్భంగా విశాఖ అభివృద్ధి కోసం తన వంతు సాయం చేస్తానని లోకేష్‌కు కృష్ణ హామీ ఇచ్చారు.

లోకేష్ వ్యూ సీఈవో ముల్పూరిని, అప్లైడ్ మెటిరీయల్స్ ఎగ్జిక్యూటివి వైస్ ప్రెసిడెంట్ రణ్‌ధీర్ ఠాకూర్ తదితరులను కలిశారు. వీరు కూడా తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

లాస్ ఏంజిల్స్‌లోని ఒక హోటల్లో నారా లోకేష్ ప్రవాసాంధుర్లతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల దత్తత పైన ప్రసంగించారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సందేహాలను తీర్చారు. ఈ కార్యక్రమం ద్వారా 126 మంది ప్రవాసాంధ్రులు తమ తమ గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. గ్రామాల దత్తతకు సంబంధించిన ఒప్పందాలపై అక్కడే సంతకాలు చేశారు.

ఇప్పటికే తమ గ్రామాలను ఇతరులు దత్తత తీసుకుంటే.. అదే గ్రామానికి చెందిన ఇతరులు శ్రీకాకుళం జిల్లాలోని వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు లాస్ ఏంజిల్స్‌లోని టీడీపీ విభాగం నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికింది.

English summary
AP Chief Minister N. Chandrababu Naidu’s son and Telugu Desam leader Nara Lokesh on Tuesday met several investors and industrialists from the IT, ITeS and electronic-manufacturing sectors during his visit to the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X