వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంగళగిరి మరో సైబరాబాద్, 10లో 2 ఏపీ ఫోన్లే: టెక్ సంస్థను ప్రారంభించిన లోకేష్

మంగళగిరిని మరో సైబరాబాద్‌గా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చే రెండేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రెండు లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: మంగళగిరిని మరో సైబరాబాద్‌గా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చే రెండేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రెండు లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని చెప్పారు. మంగళగిరిలో ఫైకేర్ సర్వీసెస్ ఐటీ సంస్థను ఆయన శుక్రవారం ప్రారంభించారు.

ప్రపంచానికి తెలిసింది..

ప్రపంచానికి తెలిసింది..

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. విశాఖపట్నంతో సమానంగా అమరావతిని ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా చేస్తామని అన్నారు. సైబరాబాద్‌కు శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ఐటీ పరిశ్రమలు వస్తాయా? అని అందరూ ఎద్దేవా చేశారని.. ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో ప్రపంచానికి తెలుస్తోందని అన్నారు.

Recommended Video

Nara lokesh again slipped his tongue - Oneindia Telugu
మంగళగిరి కూడా..

మంగళగిరి కూడా..

మంగళగిరిని కూడా భవిష్యత్‌లో ఇదే విధంగా అభివృద్ధి చేస్తామని లోకేష్ తెలిపారు. మంగళగిరిలో ఐటీ పార్కుకు ఇప్పటివరకు రూ.220కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 2019లోపు మంగళగిరి ఐటీ క్లస్టర్స్‌లో 10వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

డిసెంబర్ నుంచి హెచ్‌సీఎల్

డిసెంబర్ నుంచి హెచ్‌సీఎల్

అమరావతిలో 200 ఎకరాల్లో ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు హెచ్‌సీఎల్ సంస్థ తన కార్యకలాపాలు అక్కడ్నుంచి ప్రారంభిస్తుందని లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ కృత్రిమ మేధస్సు పరిశోధనలకు కేంద్రంగా మలుస్తామని నారా లోకేష్ తెలిపారు.

10లో 2 ఏపీ ఫోన్లే

10లో 2 ఏపీ ఫోన్లే

అలాగే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లోనూ ఏపీ ముందంజలో ఉందని తెలిపారు. దేశంలో తయారయ్యే ప్రతి 10 ఫోన్లలో 2ఏపీ నుంచే వస్తున్నాయని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో 20వేల ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు.

English summary
Andhra Pradesh minister Nara lokesh on Friday launched a Software company in Mangalagiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X