వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పాకు కలిసొచ్చేలా జగన్?: 'బ్రహ్మానంద'కు అఖిల ఒక్కరే.. లోకేష్, బాలయ్య దిగితే?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఎన్నికల్లో నెగ్గుకురావడమంటే అంత ఆషామాషీ వ్యవహారమేమి కాదు. మనీతో మేనేజ్ చేయాలనుకోవడం అన్నిసార్లు కుదరకపోవచ్చు. జనం ముందు స్ట్రాంగ్ పర్సనాలిటీని నిలుచోబెడితే తప్ప కనీసం సభలు, సమావేశాలకైనా చెప్పుకోదగ్గ రీతిలో జనం రారు. డబ్బులిచ్చి జనాలను తరలించినా.. పోలింగ్ నాటికి సత్తా ఏంటో బయటపడటం ఖాయం.

బీజేపీతో 'బిగ్ డ్యామేజ్' తప్పదనే?: నంద్యాలపై ఆ పార్టీ మౌనం వెనుక.. బాబు ప్లాన్?బీజేపీతో 'బిగ్ డ్యామేజ్' తప్పదనే?: నంద్యాలపై ఆ పార్టీ మౌనం వెనుక.. బాబు ప్లాన్?

నంద్యాల ఉపఎన్నికను నిశితంగా గమనిస్తే.. శిల్పా మోహన్ రెడ్డి పేరు వినిపించినంతగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరు అంతగా వినిపించడం లేదనే చెప్పాలి. మీడియాలో అయితే శిల్పా పేరే ఎక్కువగా మారుమోగుతోంది. బ్రహ్మానందరెడ్డిపై టీడీపీ అంతగా ఫోకస్ పెట్టకపోవడం వల్లే ఆయనకంతగా ప్రచారం లభించడం లేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

శిల్పాకు జగన్ అండ:

శిల్పాకు జగన్ అండ:

వైసీపీ తరుపున నేరుగా రంగంలోకి దిగిన జగన్.. భారీ బహిరంగ సభతో శిల్పాకు కొండంత భరోసానిచ్చారు. రోజా లాంటి ఫైర్ బ్రాండ్, ఇతర పార్టీ నేతలు బాగానే ప్రచారం చేస్తున్నారు. జగన్ సైతం మంగళవారం నుంచి నేరుగా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ప్రచార హోరు ముగిసేవరకు నంద్యాలలోనే ఉండి ఆయన శిల్పా తరుపున ప్రచారం చేయనున్నారు.

Recommended Video

YS Jagan Shock To Bhuma Akhila Priya
భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి భిన్నం:

భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి భిన్నం:

పార్టీ అధినేతే స్వయంగా లాంగ్ షెడ్యూల్‌తో ప్రచారంలోకి దిగుతుండటం శిల్పాకు కలిసొచ్చే అంశం. అదే సమయంలో ఇటు భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉందన్న వాదన ఉంది. ఆయన తరుపున ప్రచారంలో ప్రధానంగా కనిపిస్తున్నది అఖిలప్రియ మాత్రమే. అటు మీడియాలోను, ఇటు జనంలోను ఆమె ముందుండి ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

రోజాను ఎదుర్కోవడంలో అఖిల తడబాటు:

రోజాను ఎదుర్కోవడంలో అఖిల తడబాటు:

అయితే రోజా లాంటి ఫైర్ బ్రాండ్‌ను ఎదుర్కోవడంలో అఖిలప్రియ అనుభవ రాహిత్యం బయటపడుతోంది. టీవీ కార్యక్రమాల చర్చల్లో రోజాతో వాదించడంలో ఆమె అంత పటిమ కనబర్చలేకపోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు సైతం ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని.. దాన్నే ప్రచారం కింద సరిపెట్టారన్న వాదన కూడా ఉంది. ఆయన తర్వాత వెళ్లిన మంత్రులు కూడా ఇటు మీడియాను, అటు ప్రజలను ఆకర్షించడంలో ఎంతవరకు సఫలమవుతున్నారన్నది అనుమానమే.

లోకేష్, బాలకృష్ణలు దిగితే?:

లోకేష్, బాలకృష్ణలు దిగితే?:

ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణలను రంగంలోకి దించితే భూమా బ్రహ్మానందరెడ్డికి మంచి బూస్టింగ్ వస్తుందన్న అభిప్రాయాలు టీడీపీ నుంచే వ్యక్తమవుతున్నట్లే తెలుస్తోంది. అఖిలప్రియ ధోరణితో ఇప్పటికే పార్టీలో చీలికలు ఏర్పడగా.. ఆమె ప్రచారం ఎంతమేర కలిసొస్తుందన్న దానిపై సీఎం చంద్రబాబు కొంత ఆందోళనగా ఉన్నారట.

ఈ నేపథ్యంలోనే లోకేష్,బాలకృష్ణలను చంద్రబాబు ప్రచార పర్వంలోకి దించవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.
అయితే సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ.. వీలు చూసుకుని నంద్యాల ప్రచారంలో అడుగుపెడుతారా? అంటే కచ్చితంగా చెప్పలేమనే సమాధానమే వినిపిస్తోంది. లోకేష్-బాలకృష్ణలు జోడీగా ప్రచారం చేస్తే మాత్రం ఎంతో కొంత పార్టీకి లబ్ది చేకూరుతుందనేది ఆ పార్టీలో వినిపిస్తున్న అభిప్రాయమే. ముఖ్యంగా మీడియాలో మంచి హైప్ వస్తుందని భావిస్తున్నారు. చూడాలి మరి.. బ్రహ్మానందరెడ్డికి అండగా వీరైనా ప్రచారానికి ఊపు తీసుకొస్తారేమో?

English summary
Minister Nara Lokesh, MLA Balakrishna are may combinedly campaign for Nandyala bypoll to face YSRCP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X