వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌తో పోలికా?: జూ.ఎన్టీఆర్‌తో విభేదాలపై లోకేష్, జగన్-కేటీఆర్‌ల పైనా

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాలు, తెలంగాణ మంత్రి కెటీఆర్‌తో పోలిక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కాపునేత ముద్రగడ పద్మనాభంను పోల్చడం తదితర అంశాలపై మంత్రి నారా లోకేష్ బుధవారం స్పందించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాలు, తెలంగాణ మంత్రి కెటీఆర్‌తో పోలిక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కాపునేత ముద్రగడ పద్మనాభంను పోల్చడం తదితర అంశాలపై మంత్రి నారా లోకేష్ బుధవారం స్పందించారు.

'జగన్ కడపలో బాబాయిని గెలిపించలేదు కానీ', రెండోసారి.. బాబుకు శిల్పా చేయి'జగన్ కడపలో బాబాయిని గెలిపించలేదు కానీ', రెండోసారి.. బాబుకు శిల్పా చేయి

జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాలు లేవు

జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాలు లేవు

నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా తాము స్వాగతిస్తామని చెప్పారు. చంద్రబాబు తర్వాత టిడిపిను నడిపేది ఎవరనే విషయమై ఐదారేళ్ల క్రితం విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. 2009 ఎన్నికల్లో టిడిపికి ప్రచారం చేసిన జూనియర్.. 2014లో మాత్రం దూరంగా ఉన్నారు. మద్దతిస్తే తీసుకుంటామని మాత్రమే చెప్పింది.

Recommended Video

Chandrababu Naidu And His son Nara Lokesh Fight Real OR Fake ?
పవన్ కళ్యాణ్‌తో పోలికా?

పవన్ కళ్యాణ్‌తో పోలికా?

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పోలిక తీసుకు రావడాన్ని నారా లోకేష్ అంగీకరించలేదు. పవన్‌కు, ముద్రగడకు పోలికనా అని ఎద్దేవా చేశారు. సమస్యలను సృష్టించే వ్యక్తి ముద్రగడ అని, సమస్యలపై పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. వీరిద్దరికి పోలిక ఎక్కడ అని అభిప్రాయపడ్డారు.

కేటీఆర్‌తో కాదు.. చంద్రబాబుతో నా పోటీ

కేటీఆర్‌తో కాదు.. చంద్రబాబుతో నా పోటీ

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో మీకు పోటీయా అంటే.. తనకు, ఆయనకు మధ్య పోటీ లేదని లోకేష్ చెప్పారు. తన పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్నారు.

జగన్‌ది రౌడీషీటర్ మనస్తత్వం, 25 సీట్లు కూడా రావు

జగన్‌ది రౌడీషీటర్ మనస్తత్వం, 25 సీట్లు కూడా రావు

వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిది రౌడీషీటర్ మనస్తత్వం అని లోకేష్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి కనీసం 25 సీట్లు కూడా రావన్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

నంద్యాలలో వంద శాతం టిడిపిదే గెలుపు

నంద్యాలలో వంద శాతం టిడిపిదే గెలుపు

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు నల్లేరు మీద బండిలా ఉంటుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి వంద శాతం గెలుస్తారని తెలిపారు. అధికారుల చేతుల్లోకి సీఎం వెళ్లారన్నది వాస్తవం కాదన్నారు.

ఫ్యామిలీని మిస్ అవుతున్నా, అది నిజమే

ఫ్యామిలీని మిస్ అవుతున్నా, అది నిజమే

పార్టీలో హ్యూమన్ టచ్ పోయిందంటే ఓప్పుకోమని లోకేషఅ చెప్పారు. బిజీ షెడ్యూల్ కారణంగా తాను ఫ్యామిలీనే మిస్ అవుతున్నానని చెప్పారు. ఎమ్మెల్యేలను, మంత్రులను వెయిట్ చేయిస్తున్నానన్నది సరికాదన్నారు. అందులో నిజం లేదన్నారు. పార్టీకి సమయం ఇవ్వకపోవడం నిజమే అన్నారు. నియోజకవర్గాల పెంపుపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. సరేగాలో అక్రమాలు అంటూ వైసిపి కేంద్రానికి ఫిర్యాదు చేస్తోందన్నారు.

English summary
Andhra Pradesh minister Nara Lokesh on Wednesday responded on Jana Sena chief Pawan Kalyan, actor Jr ntr, Telangana Minister KT Rama Rao and YSRCP chief YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X