అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సైబరాబాద్ తరహాలో ఐటీ అభివృద్ధి: 7ఐటీ కంపెనీలను ప్రారంభించిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కాస్మోపాలిటన్ సిటీగా మారుస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని అడ్రస్ కూడా లేదని అన్నారు. విజయవాడ శివారులోని గన్నవరంలో గల మేధా టవర

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కాస్మోపాలిటన్ సిటీగా మారుస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని అడ్రస్ కూడా లేదని అన్నారు. విజయవాడ శివారులోని గన్నవరంలో గల మేధా టవర్స్‌లో ఏడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను నారా లోకేశ్‌ బుధవారం ప్రారంభించారు.

ఏడు కంపెనీల్లో 1650 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. మేధా టవర్స్‌లోని రెండస్థుల్లో కంపెనీల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. కార్యకలాపాలను ప్రారంభించిన కంపెనీలలో స్పెయిన్ కు చెందిన గ్రూపో అంటోలిన్, జర్మనీకి చెందిన ఐఈఎస్, ఎంఎన్సీ రోటోమేకర్, అమెరికాకు చెందిన మెస్లోవా, చందుసాఫ్ట్, ఈసీ సాఫ్ట్, యమైహ్ ఐటీ సొల్యూషన్స్ ఉన్నాయి.

Nara Lokesh Starts IT Companies In Medha Towers

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. మేధా టవర్స్‌కు మరిన్ని కంపెనీలు వస్తాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ తట్టుకుని ఏపీకి కంపెనీలు తీసుకొస్తున్నామని తెలిపారు.

సైబర్ టవర్ అనే ఒక్క భవనంతో హైదరాబాద్ రూపురేఖలు మారాయని, సైబరాబాద్ ఏర్పడిందని చెప్పారు. ఏపీలోనూ ఇదే తరహాలో ఐటీ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఐటీ, ఆర్అండ్ బీ, రీసెర్చ్ బేస్డ్ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. 6లక్షల ఉద్యోగాలు తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని అన్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలతో మాట్లాడామని తెలిపారు.

5లక్షల మానుఫాక్చరింగ్ జాబ్స్ వస్తాయన్నారుగా అందుకు శిక్షణ కలిగిన యువత కావాలి అందుకు ఏం చేస్తారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. మంత్రి సమాధానం చెబుతారని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ల ద్వారా యువతకు ఉపాధి శిక్షణ ఇస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. 450కాలేజీల్లో స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

ఏపీలో టాలెంట్‌కు కొదవలేదని, స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఏపీలో ఐటీకి ఐకానిక్ టవర్ గా మిలీనియం టవర్స్ ఉండబోతోందని లోకేష్ అన్నారు. అమరావతికి మరింత కనెక్టివిటీని పెంచుతామని చెప్పారు. అమరావతి, విశాఖపట్నం నుంచి 6నెలల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని లోకేష్ చెప్పారు.

English summary
TDP leader Nara Lokesh on Wednesday launched IT Companies In Medha Towers in Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X