అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: ఐటీ హబ్‌గా విజయవాడ, హెచ్‌సి‌ఎల్ కార్యకలాపాలు త్వరలోనే

విజయవాడ ఇక ఐటీ కేంద్రంగా మారనుంది. ఆంధ్రపద్రేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయి. ఈ నెల 10వ, తేదిన ఏడుసంస్థలు తమ కార్యాలయాలను ప్రారంభించనున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడ ఇక ఐటీ కేంద్రంగా మారనుంది. ఆంధ్రపద్రేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయి. ఈ నెల 10వ, తేదిన ఏడుసంస్థలు తమ కార్యాలయాలను ప్రారంభించనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ సంస్థలు ముందుకువస్తున్నాయి. అమరావతి, విజయవాడ నగరాల్లో ఏర్పాటు చేయడానికి ఆసక్తితో ఉన్నాయి.

Recommended Video

Good News for Techies Find Out More

ఇప్పటికే 18 ఐటీసంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. హెచ్‌సిఎల్ లాంటి సంస్థలు విజయవాడలో తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి.

దీంతో మరికొన్ని ఐటీ సంస్థలు విజయవాడకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికాలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు.

ఈ నెల 10న, ఏడుసంస్థల ప్రారంభం

ఈ నెల 10న, ఏడుసంస్థల ప్రారంభం

విజయవాడలో కార్యకలపాలు చేపట్టడానికి ముందుకు వచ్చిన ఏడు ఐటీ కంపెనీలు సోమవారం నుండి ప్రారంభంకానున్నాయి. ఆటోనగర్, మహనాడురోడ్డులోని కె.బిజినెస్ స్పేస్ భవనంలో ఈ ఏడు కంపెనీలకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి లోకేష్ ప్రారంబించనున్నారు. ఈ కంపెనీల ద్వారా 280మందికి ఉద్యోగాలు రానున్నాయి.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు అన్నిరకాల సహయసహకారాలను అందిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది

ఐటీ సంస్థల సేవలు

ఐటీ సంస్థల సేవలు


ఈ ఏడాది ఆరంభం నుండి ఏపీ రాష్ట్రంలో ఐటీ సంస్థలు తమ సేవలను అందించేందుకు ముందుకువస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ, తేదిన ఇండ్‌వెల్ టవర్స్ లో పలు సంస్థలు పనిని ప్రారంభించాయి. ఎడ్‌బ్రిక్స్, ఆడెప్ట్ టాలెంట్, పేటీఎం, అడ్వాన్స్ సాఫ్ట్, యాక్సెల్ ఐటీ, జోల్ట్,డామియన్ సంస్థలు పనిచేస్తున్నాయి.ఈ సంస్థలు సుమారు 400 మందికి ఉద్యోగాలను కల్పిస్తున్నాయి.ఇక మే మాసంలో మేథాటవర్స్‌లో గ్రూప్ అంటోలిన్, మెల్సోవ, ఈపీ సాఫ్ట్, యమహా ఐటీ సాఫ్ట్, రోబోమేకర్, ఐఈఎస్, చందు సాఫ్ట్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థల్లో సుమారు 1500 మందికి ఉద్యోగాలు వచ్చాయి.

ఐటీకేంద్రంగా విజయవాడ

ఐటీకేంద్రంగా విజయవాడ


రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ సాఫ్ట్‌వేర్‌ను పరిశ్రమను అభివృద్ది చేయాలని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసినట్టుగానే హైటెక్‌సిటీ తరహ విజయవాడ పరిసరాల్లో కూడ ఐటీ పరిశ్రమను అభివృద్ది చేయాలని ఆయన భావిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలను ఆహ్వనించారు.ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఇక్కడ పనిని ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు త్వరలో రానున్నాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

పెట్టుబడులకు ప్రోత్సాహకాలు

పెట్టుబడులకు ప్రోత్సాహకాలు


ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌లో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉండడం తదితర కారణాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఐటీ పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం సానుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ఈ పరిస్థితి ఇలానేఉంటే విజయవాడ, అమరావతి పరిసరప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

English summary
Ap IT minister Nara Lokesh will launch 7 software companies in Vijayawada on Monday. HCL will start its branch soon said officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X