వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పవన్ కల్యాణ్! చేతనైతే రా.... లేదంటే రజనీకాంత్‌లా ఇంట్లో ఉండు'

By Pratap
|
Google Oneindia TeluguNews

కడప: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సిపిఐ నాయకుడు నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'చేతనైతే రాజకీయాల్లోకి రా.... లేదంటే రజనీకాంత్‌లా ఇంట్లో ఉండు' అంటూ ఆయన పంచ్ ఇచ్చారు. నేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు చేయాలని. లేకపోతే రజనీకాంత్‌లాగా సినిమాల్లోనే నటించాలని ఆయన అన్నారు.

పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో దోబూచులాడుతున్నారన్నారని విమర్శించారు. సినిమానా లేక రాజకీయలా ఏదో ఒకటి తేల్చుకోవాలని నారాయణ ఆయనకు శనివారం మీడియా సమావేశంలో సూచించారు. సూచించారు. పవన్ కల్యాణ్ వైఖరి పొంగే పాలల్లో ఉప్పు వేసే రకంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan

అభిమానులను పవన్ కల్యాణ్ స్వార్థం కోసం వాడుకుంటున్నారని, అభిమాన సంఘాల పేరుతో కొట్టుకునే విధంగా వారిని హీరోలు తయారు చేస్తున్నారని అంటూ కోలార్‌లో ఇటీవల ఓ యువకుడి హత్య జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పూటకో కోటు వేసుకొని తిరుగుతున్నారని అన్నారు. ఇప్పటికే ఆయన వేసుకునే కోటు కోసం రూ.97 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వేసుకునే ఒక్కో కోటు విలువ రూ.10 లక్షలు చేస్తోందని విమర్శించారు.

స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీస్తామన్న మోడీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఇదేమని అడిగితే అడిగిన వారినందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని నారాయణ ఆరోపించారు.

English summary
CPI leader Narayana has lashed out at Jana Sena chief Pawan Kalyan and suggested to decide on political entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X