వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసులో కొత్త కోణం: రిషికేశ్వరి ఘటనపై చీఫ్ వార్డెన్ ఏమన్నారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషికేశ్వరి మృతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. రిషికేశ్వరి కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

రిషికేశ్వరి మృతి దారి తీసిన సంఘటనల వెనక ఇద్దరు యువకులు, ఓ యువతితో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోని అతన్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇదిలావుంటే, రిషికేశ్వరితో పాటు మిగిలిన విద్యార్థులు మంగళగిరిలో సినిమా చూడలేదని, విజయవాడలోని ఓ మల్టీఫ్లెక్స్‌ థియేటర్లో చూశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది.

రాత్రి 11 గంటలకు రిషికేశ్వరితో పాటు మిగతా విద్యార్థులు హాస్టల్‌కు చేరుకున్నారని, ఆ తర్వాత ఆమె భోజన చేసి పడుకుందని అంటున్నారు. ఈ స్థితిలో సినిమా థియేటర్‌లోనే కాకుండా హాస్టల్‌లో ఏం జరిగిందనే విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

New angle in Rishikeswari case: Warden speaks on Ragging

ఇదిలావుంటే, రిషికేశ్వరి మృతి కేసులో నాగార్జున విశ్వవిద్యాలయం బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్ స్వరూపరాణి స్పందించారు. రిషికేశ్వరి కేసులో ఆమె శనివారంనాడు జిల్లా లోక్‌ అదాలత్ ముందు హాజరయ్యారు. హాస్టల్‌లో ర్యాగింగ్ ఉన్న మాట వాస్తవమేనని ఆమె ఈ సందర్భంగా అంగీకరించారు.

అయితే రిషికేశ్వరి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు రిషికేశ్వరి మరణించిన రోజున తాను హాస్టల్‌కు వచ్చేసరికి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తున్నారని ఆమె చెప్పారు. అప్పటికే రిషికేశ్వరి చనిపోయిందని విశ్వవిద్యాలయం వైద్యాధికారి ధ్రువీకరించారని చెప్పారు. ఆ తర్వాత రిషికేశ్వరి మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారని స్వరూపరాణి చెప్పారు.

English summary
It is said that one more person involved in Nagarjuna University student Rishikeswari death incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X