అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పడకగదిలో సహకరించలేదని?: బైబిల్‌లో సూసైడ్ లెటర్, వివాహిత ఆత్మహత్యకు కారణమదే!

బెడ్రూమ్ లో ఆమె ప్రవర్తనపై అసంతృప్తితో.. చచ్చిపో అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో సుజల అనే వివాహిత ఆత్మహత్య వెనుక మిస్టరీ వీడింది. భర్త వేధింపులే ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా పోలీసులు నిర్దారించారు. పెళ్లయిన మూడు నెలలకే ఆమె ఆత్మహత్యకు యత్నించడంతో.. సుజల ఆత్మహత్యపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

అయితే పడకగదిలో సరిగా సహకరించడం లేదన్న కోపంతో భర్త చీటికీ మాటికీ ఆమెను విసుక్కున్నట్లుగా తెలుస్తోంది. బెడ్రూమ్ లో ఆమె ప్రవర్తనపై అసంతృప్తితో.. చచ్చిపో అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సుజల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువుకు చెందిన అమరనాథ్ అనే వ్యక్తి డెంటల్ హాస్పిటల్ నడుపుతున్నాడు. గత మే నెలలో హైదరాబాద్ కు చెందిన సుజల(27)తో అమరనాథ్‌కు వివాహం జరిగింది. వివాహనంతరం అమరావతిలోని విజయవాడ రోడ్డులో ఉన్న ఓ అద్దె ఇంటిలో కాపురం పెట్టారు.

newly married woman suicide in amaravati

ఇటీవల ఆషాఢ మాసం సందర్భంగా సుజల పుట్టింటికి వెళ్లి మూడు రోజుల క్రితమే అమరావతికి చేరుకుంది. ఇదే క్రమంలో శనివారం సాయంత్రం అమరనాథ్ ఆసుపత్రికి వెళ్లగా.. అతను తిరిగొచ్చేసరికి భార్య సుజల ఆత్మహత్య చేసుకుని కనిపించింది. చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆత్మహత్య చేసుకునేముందు తల్లిదండ్రులకు సుజల ఒక మెసేజ్ కూడా పెట్టింది. తన చావుకు భర్తే కారణమంటూ అందులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే సూసైడ్ లెటర్ కూడా రాసి ఇంట్లో ఉన్న బైబిల్ లో పెట్టింది. సుజల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అమరనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుజల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.

English summary
Sujala, A newly married woman was committed suicide in Amaravati, Andhradesh. she mentioned in suicide letter that his husband is ther reason for her suicide
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X