వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు: ఆర్బీఐ గవర్నర్ హామీ, వెంటనే చార్టెడ్ ప్లైట్‌లు ఏర్పాటు చేసిన బాబు

రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ఏపీలో నగదు కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కసరత్తు ఫలించింది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ఏపీలో నగదు కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కసరత్తు ఫలించింది. ముఖ్యమంత్రి ప్రయత్నంతో రాష్ట్రానికి రూ.2420 కోట్ల నగదు చేరిన విషయం తెలిసిందే.

పవన్ ఎంట్రీతో ఏపీలో కీలక పరిణామాలు, జగన్‌కు నష్టమా లాభమా?పవన్ ఎంట్రీతో ఏపీలో కీలక పరిణామాలు, జగన్‌కు నష్టమా లాభమా?

ఈ నగదును ప్రత్యేక విమానాల ద్వారా తిరుపతి, విశాఖలకు చేర్చారు. రాష్ట్రానికి వచ్చిన నగదును అన్ని ప్రాంతాలకు చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తక్కువ అవసరం ఉన్న జిల్లాలకు రూ.160 కోట్లు, ఎక్కువ అవసరం ఉన్న జిల్లాలకు రూ.240 కోట్ల చొప్పున పంపిణీ చేస్తోంది.

బ్యాంకర్లు నగదును అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు, విద్యార్థులు ప్రజలకు నగదు రహిత లావాదేవీల పైన అవగాహన కల్పించాలని సూచించారు. ఈ అంశంలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయం పరిశీలిస్తామన్నారు.

chandrababu naidu

కాగా, నోట్ల రద్దు నేపథ్యంలో ఏపీ నగదు ఇబ్బందులు ఎదుర్కొంటోందని చంద్రబాబు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో పాటు రూ.2,500 కోట్లు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.

చంద్రబాబు ఫోన్‌కు ఉర్జిత్ సానుకూలంగా స్పందించారు. ఇస్తామని ఉర్జిత్ పటేల్ హామీ ఇవ్వడంతో ముఖ్యమంత్రి వెంటనే ప్రత్యేక చార్టెడ్ విమానాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే రూ.2,420 కోట్లు వచ్చాయి.

నోట్ల రద్దు టు బంగారం, మోడీకి షాక్: పవన్ కళ్యాణ్‌తో పావులు, బాబు ఏం చేస్తారు?నోట్ల రద్దు టు బంగారం, మోడీకి షాక్: పవన్ కళ్యాణ్‌తో పావులు, బాబు ఏం చేస్తారు?

బ్యాంకులో డబ్బున్నా, చేతిలో లేదు

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలతోనే ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చునని చెప్పారు.

రూపే కార్డులు, సెల్ ఫోన్ల ద్వారా నగదు బదలీ చేయవచ్చునని చెప్పారు. బంగారం విషయంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించే వారికి పారితోషికం ఇస్తామన్నారు. ఉత్సాహంగా పని చేస్తే నెలకు రూ.5వేలు సంపాదించుకోవచ్చునని, అలవాటయితే కొత్త పద్ధతులు ఇబ్బంది అనిపించవని, ఆన్ లైన్ లావాదేవీలపై అవగాహన కల్పిస్తామన్నారు.

English summary
The cash was brought to Visakhapatnam and Tirupati, from there it was sent by road to all 13 districts of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X