అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్ టి ఆర్ గొప్ప నాయకుడు: రామ్ నాథ్ కోవింద్

ఎన్ టి ఆర్ గొప్ప నాయకుడని ఎన్ డిఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. ఎన్ డి ఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ విజయవాడలో మంగళవారం నాడు మద్యాహ్నం టిడిపి,

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఎన్ టి ఆర్ గొప్ప నాయకుడని ఎన్ డిఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. ఎన్ డి ఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ విజయవాడలో మంగళవారం నాడు మద్యాహ్నం టిడిపి, బిజెపి ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.రాష్ర్టపతి ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని ఆయన కోరారు.

విజయవాడలోని ఓ హొటల్ లో టిడిపి, బిజెపి ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఎన్ టి ఆర్ గొప్ప నాయకుడన్నారు రామ్ నాద్ కోవింద్. ఎన్ టి ఆర్ అవతార పురుషుడని చెప్పారు. తెలుగుజాతి అభ్యున్నతి కోసం ఎన్ టి ఆర్ కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. టిడిపి, బిజెపి నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.రాజ్యాంగమే సుప్రీం అన్నారు. కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా వ్యవహరిస్తానని ఆయన ప్రకటించారు.

 NTR a great leader: Ramnath kovind

రాష్ట్రపతి ఎన్నికల విషయమై అన్ని పార్టీలతో చర్చలు నిర్వహించామన్నారు. ఆయన అత్యంత సౌమ్యుడు, వివాదరహితుడన్నారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. మృధుస్వభావిగా పేరున్న రామ్ నాథ్ కోవింద్ పేరును ప్రకటించినట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని విపక్షాలు కలిసి మీరాకుమార్ ను బరిలోకి దించాయన్నారు. వారు తమ ఎన్నికల ప్రచారంలో సైద్దాంతిరక పోరాటం అని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. వ్యక్తుల మధ్య పోటీగా ఆయన పేర్కొన్నారు.

రామ్ నాథ్ కోవింద్ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్ నాథ్ కోవింద్ వివాదరహితుడిగా పేరుందన్నారు. బిజెపిలో అనేక పదవులు నిర్వహించారని ఆయన చెప్పారు. రాష్ట్రపతి అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయన్నారు. ఏపీ నుండి అన్ని ఓట్లు కోవింద్ కే పడతాయన్నారు. విభజన కష్టాలతో ఉన్న ఏపీ రాష్ట్రానికి కోవింద్ సహయం అవసరమన్నారు.

English summary
NDA presidential candidate Ramnath kovind campign started in Andhra pradesh state. he has met with Tdp and Bjp legislators at Vijayawada.NTR a great leader said Ramnath kovind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X