వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు

స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రేపు (బుధవారం) రెండు తెలుగు రాష్ట్రాలలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పేరుతో భారీ రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు .

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రేపు (బుధవారం) రెండు తెలుగు రాష్ట్రాలలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పేరుతో భారీ రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి తెలిపారు.

ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. తెలుగువారి హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్‌ మహోన్నత వ్యక్తిత్వాన్ని, సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని రక్తదానం నిర్వహిస్తున్నామన్నారు.

గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో 145 చోట్ల ఇదే సందర్భంలో రక్తదాన శిబిరాలు విజయవంతంగా నిర్వహించామని, ఆ స్పూర్తితో ఈసారి మరిన్ని చోట్ల నిర్వహించాలని ప్రయత్నిస్తున్నామన్నారు.

NTR Trust to conduct legendary blood donation drive on January 18

ఈ భారీ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ ట్రస్టు రక్తనిధితోపాటు రెడ్‌క్రాస్‌, రోటరీ క్లబ్‌, లయన్స్‌ క్లబ్‌, చిరంజీవి రక్తనిధి, ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకులు, ఆరోహి, ఇతర రక్తనిధి సంస్ధలు పాల్గొంటాయని ట్రస్ట్ సీఈవో టివిష్ణువర్ధన్‌ తెలిపారు.

కాగా, తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో భువనేశ్వరి, బ్రహ్మణి ప్రారంభిస్తారు. ఏపీలో విజయవాడ సిద్ధార్థ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ మ్యూజియం వద్ద టీడీపీ యువ నేత లోకేశ్‌ ప్రారంభిస్తారు.

English summary
NTR Trust to conduct legendary blood donation drive on January 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X