వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేబీఆర్ ఫైరింగ్: చంచల్‌గూడ జైలుకు ఓబులేష్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడు ఓబులేష్‌ను నాంపల్లి పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఓబులేష్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఓబులేష్‌ను తమ కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఓబులేష్‌ను పోలీసులు విచారించినప్పుడు కీలక విషయాలు వెల్లడైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన గతంలో ఓ సెలబ్రటీని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. కేబీఆర్ పార్క్ కాల్పుల అనంతరం బెంగళూరు పారిపోయేందుకు ప్రయత్నించాడు.

అతను అంతకుముందు తుపాకీని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో దాచాడు. గ్రేహౌండ్స్ అధికారులు ఆయుధాలు రికవరీ చేసిన సమయంలో అతడు తన జాకెట్ కోటులో ఏకే 47 ఆయుధాన్ని పెట్టుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ సెలబ్రటీని బెదిరించి డబ్బులు వసూలు చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఈ ఆయుధాన్ని కేబీఆర్ పార్క్ వద్ద రెండోసారి ఉపయోగించాడు.

కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేష్‌ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శుక్రవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

ఓబులేష్

ఓబులేష్

బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడు ఓబులేష్‌ను నాంపల్లి పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచారు.

ఓబులేష్

ఓబులేష్

న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఓబులేష్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఓబులేష్‌ను తమ కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఓబులేష్

ఓబులేష్

బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడు ఓబులేష్‌ను న్యాయస్థానం నుండి చంచల్ గూడ జైలుకు తరలిస్తూ...

ఓబులేష్

ఓబులేష్

కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడు ఓబులేష్‌ను న్యాయస్థానం నుండి చంచల్ గూడ జైలుకు తరలిస్తున్న పోలీసుల దృశ్యం.

ఓబులేష్

ఓబులేష్

న్యాయమూర్తి ఓబులేష్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఓబులేష్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఓబులేష్‌ను తమ కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఓబులేష్

ఓబులేష్

బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడు ఓబులేష్‌ను న్యాయస్థానం నుండి చంచల్ గూడ జైలుకు తరలించేందుకు పోలీసు వాహనం ఎక్కిస్తూ..

ఓబులేష్

ఓబులేష్

బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడు ఓబులేష్‌ను న్యాయస్థానం నుండి చంచల్ గూడ జైలుకు తరలిస్తున్న పోలీసులు.

అతని నుంచి స్వాధీనం చేసుకున్న ఎకె 47 రైఫిల్‌ను, బుల్లెట్లను కూడా మీడియా ముందు ప్రదర్శించారు. నిత్యానంద రెడ్డిపై ఓబులేష్ ఎందుకు దాడి చేశాడు, ఎలా దాడి చేశాడు, ఎలా పారిపోయాడనే విషయాలను కూడా ఆయన వివరించారు. కర్నూలు జిల్లాలో అతన్ని పట్టుకున్నట్లు ఆయన చెప్పారు.

English summary
Obulesh sent to Chanchalguda jail till December 5th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X