వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొన్ని గంటల్లో పెళ్ళి...బంగారు ఆభరణాల బ్యాగు మాయం .. పెళ్ళి ఏమైందంటే

బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలో మర్చిపోతే వారికి నిజాయితీగా బ్యాగును అందించాడు చంద్రశేఖర్ అనే ఆటో డ్రైవర్ . ఈ ఘటన చిత్తూరులో చోటుచేసుకొంది. ప్రభు తన కూతురు వివాహం గురువారంనాడు బెంగుళూరులో ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చిత్తూరు : కొన్ని గంటల్లో వివాహం, కాని పెళ్ళికొడుకుకు తయారుచేయించిన నగలు కన్పించకుండా పోయాయి. .పెళ్ళి ఆగిపోతోందని ఆడపెళ్ళివారు భయపడ్డారు. కాని, బంధువలను పెళ్ళి మంటపానికి పంపి నగల కోసం పెళ్ళి కూతురు కుటుంబసభ్యులు వెతికేందుకు బయలుదేరారు. అయితే ఓ వ్యక్తి వచ్చి బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును అందించాడు. దీంతో తమ కూతురు పెళ్ళి నిర్విఘ్నంగా సాగుతోందని ఆ కుటుంబసభ్యులు ఆనందపడ్డారు ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకొంది.

రోడ్డుపై అణ పైసా దొరికినా ఎవరికీ కన్పించకుండా తీసుకొంటాం. కాని, లక్షల రూపాయాల విలువలైన బంగారు ఆభరణాలను ఓ పెళ్ళి కూతురు కుటుంబం మర్చిపోయింది. అయితే ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ ఆ బంగారు ఆభరణాలను వారికి అందించాడు.ఆటో డ్రైవర్ ను పలువురు అభినందించారు.

చిత్తూరులోని మిట్టూరుకు చెందిన ప్రభు, ఝాన్సీ దంపతుల కుమార్తె శ్రీమతికి బెంగుళూరులో గురువారం నాడు వివాహం జరపాలని నిర్ణయించుకొన్నారు. వివాహనికి బెంగుళూరుకు బయలుదేరేందుకుగాను ప్రభు, ఝాన్సీ దంపతులు, బంధువులు బస్సులో బయలు దేరడానికి సిద్దమయ్యారు. బస్సు స్టేషన్ వరకు ఆటోలో వెళ్ళారు.

 ornaments bag forgetten in auto, driver given to the bag familymembers

బస్సు ఎక్కే సమయంలో తమతో పాటు తెచ్చుకొన్న సామాను సరిచూసుకొన్నారు. అయితే పెళ్ళికుమారుడికి తయారుచేయించిన 18 తులాల బంగారు ఆభరణాల బ్యాగు కన్పించలేదు. ఈ బ్యాగు కోసం అంతా వెతికారు. కాని, ఫలితం లేకపోయింది. బంధువులను బస్సులో పంపారు. ఈ విషయమై ప్రభు పోలీసులకు ఫిర్యాదుచేశాడు.
పెళ్ళి కొడుకు కుటుంబసభ్యులు ఎా సమాధానం చెప్పుకోవాలని ప్రభు కుటుంబసభ్యులు మధనపడ్డారు.

పెళ్లి సమయంలో పెళ్ళి కొడుకు కుటుంబసభ్యులకు ఏమని సమాధానం చెప్పాలని వారు భయపడ్డారు. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ప్రభు కుటుంబసభ్యులకు అందించాడు. ఈ ఘటనతో ప్రభు కుటుంసభ్యులు ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ ను అభినందించారు. తన ఆటోలో ప్రయాణించిన ప్రభు కుటుంబసభ్యులు బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును మరిచిపోయారు. ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత తప ఆటోలో బ్యాగును గుర్తించాడు చంద్రశేఖర్. బ్యాగులో బంగారు ఆభరణాలను చూశాడు. వెంటనే ఆయన ఈ బ్యాగును బస్సు స్టేషన్ కు వచ్చి మరీ అందించాడు. పెళ్ళి నిలిచిపోకుండా ఆపిన ందుకు చంద్రశేఖర్ ను అభినందించారు ప్రభు కుటుంబసభ్యులు.

English summary
prabhu, jhansi couple living in chittur town. on thursday prabhu's daughter marrage in banglore. they went to banglore on wednes day night, when they statr to banglore ornaments bag missplaced. prabhu family members identified this.prabhu complient to police, at that time chandrasher autodriver came to prabhu , and give to ornaments bag. prabhu family members forget this bag in chandrashekar's auto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X