పరిటాల శ్రీరామ్-జ్ఞానవిల నిశ్చితార్థం: బాలయ్య ఆశీర్వాదం, ప్రముఖులు(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీడీపీ దివంగత నేత పరిటాల రవి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత దంపతుల కుమారుడు శ్రీరామ్ నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

పరిటాల శ్రీరామ్‌కి కాబోయే భార్య ఈమే

వైభవంగా వేడుక..

వైభవంగా వేడుక..

మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్‌లో పరిటాల కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానుల మధ్య వైభవంగా సాగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

బాలయ్య ఆశీర్వాదం

బాలయ్య ఆశీర్వాదం

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులు శ్రీరామ్, జ్ఞానవిలను ఆశీర్వదించారు.

మంత్రుల హాజరు..

మంత్రుల హాజరు..

మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కొత్త జంటకు ఆశీర్వాదం

కొత్త జంటకు ఆశీర్వాదం

వీరితోపాటు అనంతపురం జిల్లా నేతలైన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, జెడ్పీ ఛైర్మన్ చమన్‌సాబ్ హాజరై శ్రీరామ్-జ్ఞానవి జంటను ఆశీర్వదించారు.

అక్టోబర్‌లో వివాహం

అక్టోబర్‌లో వివాహం

శింగనమల నియోజకవర్గం నార్పల మండలం ఏవీఆర్ కన్‌స్ట్రక్చన్స్ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానవితో పరిటాల శ్రీరామ్ వివాహం అక్టోబర్ 1న జరగనుంది.

మొదలైన పెళ్లి సందడి..

మొదలైన పెళ్లి సందడి..

అనంతపురం జిల్లా నార్పలకు చెందిన ఆలం వెంకటరమణ కుటుంబం చాలా నుంచే అనంతపురంలోనే నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 1న వివాహ వేడుక జరగనుండటంతో ఇప్పట్నుంచే ఇరు కుటుంబాల్లో సందడి ప్రారంభమైంది.

యువనేతగా ప్రజల్లో ఆదరణ

యువనేతగా ప్రజల్లో ఆదరణ

దివంగత నేత పరిటాల రవి తనయుడైన శ్రీరామ్‌కు అనంతరపురం జిల్లా ప్రజల్లో యువనేతగా మంచి మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన తల్లి సునీత మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Demolition of YSR Statues : YSRCP Allegations On Paritala Sunitha - Oneindia Telugu

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Paritala Sunitha's son Paritala Sriram engagement held in Hyderabad on Thursday.
Please Wait while comments are loading...