వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌పై సునీత ఆగ్రహం, జగన్‌పై వద్దని నెహ్రూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం/రాజమండ్రి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విమర్శలు గుప్పించడం సరికాదని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తప్పుబట్టారు. ఆదివారం సునీత మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యవహార సరళిని ఖండించారు. ఉదయం అనంతపురం రైతు బజార్‌ను సందర్శించిన సమయంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.

జగన్ పైన విమర్శలు వద్దు: జ్యోతుల నెహ్రూ

తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా నేత జ్యోతుల నెహ్రూ ఆదివారం అన్నారు. వాకతిప్ప బాధితులను పరామర్శించిన జగన్, వారికెలాంటి సహాయం అందించలేదని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ చేసిన ఆరోపణలపై నెహ్రూ తీవ్రంగా స్పందించారు.

Paritala Sunitha condemns KCR comments

వాకతిప్ప పేలుడు ఘటన బాధితులకు ప్రభుత్వం ఏ మేరకు సహాయం ప్రకటించిందన్న దానిపై వర్మ మాట్లాడాలని నెహ్రూ సూచించారు. పార్టీ తరఫున బాధితులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని జగన్ ప్రకటించారన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ప్రమాదాల్లో మరణించిన వారికి రూ.5 లక్షల పరిహారం దక్కితే, వాకతిప్ప బాధితులకు మాత్రం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించడాన్ని ఆయన ప్రశ్నించారు. వివక్ష చూపుతున్న సర్కారును వదిలి, జగన్ పై ఆరోపణలు చేయడాన్ని వర్మ మానుకోవాలని ఆయన సూచించారు.

కేసీఆర్‌ నోరు అదుపులో పెట్టుకో

కేసీఆర్‌ చేతగానితనం, నిర్లక్ష్యం, దగాకోరుతనం వల్లే తెలంగాణకు కరెంటు కష్టాలు వచ్చాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నార. కేసీఆర్ తన చేతగానితనాన్ని చంద్రబాబుపై రుద్ది చెత్త భాషతో మాట్లాడటం మానుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగినరీతిలో బుద్ధి చెబుతామని తిరుపతిలో హెచ్చరించారు.

తెలంగాణలో కరెంటు కష్టాలతో రెండు రోజుల్లో పదిమంది రైతులు చనిపోరునా కేసీఆర్‌కు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. రైతుల ఆత్మహత్యలకు సమాధానం చెప్పలేకనే ఆయన చంద్రబాబుపై అబాండాలు వేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు 24గంటల్లో కేసీఆర్ క్షమాపణ చెప్పాలని శాసన మండలి సభ్యురాలు నన్నపునేని రాజకుమారి వేరుగా డిమాండ్‌ చేశారు.

English summary
AP Minister Paritala Sunitha condemns Telangana CM KCR comments on AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X