వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెంటిపై ఆగ్రహం... గంటన్నరపాటు పవన్ చర్చలు, తెలివిగా ఓకే చెప్పా: బాబు

తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో నెరవేర్చక పోవడం పైనే సిపిఐ నేతలు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో నెరవేర్చక పోవడం పైనే సిపిఐ నేతలు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగింది.

గురువారం గంటన్నర పాటు పవన్, సిపిఐ నేతలు మాట్లాడుకున్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన చర్చించారు. ముఖ్యమంగా హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన అంశంపై చర్చించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పైన చర్చించారు.

అలా పావులు, పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఏపీలో కీలక పరిణామాలు, జగన్‌కు ఎలా లాభం!అలా పావులు, పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఏపీలో కీలక పరిణామాలు, జగన్‌కు ఎలా లాభం!

ప్రభుత్వం రైతుల భూములను తీసుకుని లక్షలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు కట్టబేట్టే అంశం పైనా చర్చించారు. రాజధాని నుంచి పోర్టు వరకు అవసరానికి మించి చంద్రబాబు ప్రభుత్వం భూములు తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయపడ్డారు. రాజకీయ పొత్తుల గురించి మాత్రం చర్చించలేదంటున్నారు.

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడే అంశంపై చర్చించారు.సీపీఐ, సీపీఎం, జనసేన కలిసి ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సిపిఐ నేత రామకృష్ణ వెల్లడించారు.

pawan kalyan

తెలివిగా ప్యాకేజీకి ఒప్పుకున్నా: చంద్రబాబు

కేంద్ర ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి తాను తెలివిగానే ఒప్పుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో కొందరు రాజకీయ లబ్ధి కోసం తనను విమర్శిస్తున్నారన్నారు. తనకు తెలియని విషయాలు చెబితే స్వీకరిస్తానని చెప్పారు.

నోట్ల రద్దు టు బంగారం, మోడీకి షాక్: పవన్ కళ్యాణ్‌తో పావులు, బాబు ఏం చేస్తారు?నోట్ల రద్దు టు బంగారం, మోడీకి షాక్: పవన్ కళ్యాణ్‌తో పావులు, బాబు ఏం చేస్తారు?

తాజాగా పోలవరం ప్రాజెక్టుకు రూ. 2915 కోట్లు నాబార్డు నిధులిస్తున్నారన్నారు. భూసేకరణకు కూడా సుమారు 27 వేల కోట్లు అవసరమవుతుందన్నారు. 40 వేల ఎకరాలు భూమి కొనివ్వాల్సిన పరిస్థితులున్నాయన్నారు. ప్రాజెక్టుకు ఇంకా రూ. 37 వేల కోట్లు అవసరమవుతాయన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగించాలో, తెగదెంపులు చేసుకోవాలో తెలిసే ప్యాకేజీకి ఒప్పుకున్నానని చెప్పారు. హోదాకు తగ్గకుండా ప్రయోజనాలు ప్యాకేజీ ద్వారా అందిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. బంగారు విషయంలో ఎవరూ భయపడవద్దని, తాను కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

English summary
Pawan Kalyan angry over Special Status issue and Land pooling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X