వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క పవన్ కళ్యాణ్: ఎన్నో పాత్రలు, ఏది చేసినా సంచలనమే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారే ఎన్నో పాత్రల్లో కనిపిస్తున్నారు! ఓ వైపు సినిమాలలో బిజీగా ఉంటూనే.. రాజకీయాల పైన హఠాత్తుగా దృష్టి సారించారు. తెలుగు ప్రజలకు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టం గురించి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. తద్వారా పవన్ కళ్యాణ్ ఒక్కసారే పలు పాత్రలు పోషిస్తున్నారు.

సినిమా హీరోగా, నిర్మాతగా, రాజకీయాల్లో... ఎన్నో పాత్రలలో కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు పవన్ కళ్యాణ్ హీరో. ఆ తర్వాత జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవలే రెండు సంచలన వార్తలు బయటకు వచ్చాయి. అందులో ఒకటి ఆయన దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రొడక్షన్లో సినిమా చేయడం.

మరొకటి ఇంకా ఆసక్తికరమైన విషయం తన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ హీరోగా పవన్ కళ్యాణ్ ఓ సినిమా నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి. హీరోగా బిజీగా ఉంటూనే, నిర్మాతగా మారుతుండటం గమనార్హం.

Pawan Kalyan backs special status for Andhra Pradesh

అదే సమయంలో రెండు రోజులుగా రాజకీయ అంశాల పైన దృష్టి సారించారు. రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చారు. ఏపీకీ జరిగిన న్యాయం గురించి చర్చించేందుకు ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఇరువురు నేతలు కలిసి ప్రధాని మోడీని కలవనున్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణతో రైతుల అసంతృప్తి విషయమై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఆయన ఈ నెల 5వ తేదీన రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత చాలా రోజుల తర్వాత పవన్... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు ముందుకు వచ్చారని చెప్పవచ్చు. పవన్ ఏది చేసినా అది సంచలనమే అవుతుంది. పవన్ పార్టీ పెట్టినా, దాసరి ప్రొడక్షన్లో సినిమా అన్నా, చెర్రీ హీరోగా నిర్మాతగా అన్నా.. ఏదైనా సంచలనం సృష్టిస్తుంది.

English summary
AP Chief Minister N Chandrababu Naidu got support from actor and Jana Sena chief Pawan Kalyan to pressurise the Centre to accord special category status to the state and secure financial support to build the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X