వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామ్రేడ్ టీఎన్‌కి తలవంచి నమస్కరిస్తున్నా: పవన్ కళ్యాణ్

కమ్యూనిస్టు నేత కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి(టీఎన్) శతజయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ఇది.. కామ్రేడ్ తరిమెళ్ల నాగిరెడ్డి శత జయంతి సంవత్సరం అని,

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. ఈసారి కమ్యూనిస్టు నేత కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి(టీఎన్) శతజయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ఇది.. కామ్రేడ్ తరిమెళ్ల నాగిరెడ్డి శత జయంతి సంవత్సరం అని, ఈ సందర్భంగా చిన్నతనంలో జరిగిన ఓ విషయం తనకు గుర్తుకు వస్తోందని అన్నారు.

Jana Sena Party president Pawan Kalyan on Sunday responded on Tarimala Nagi Reddy's Birth Centenary

తాను ఇంటర్మీడియట్ చదువుతుండగా, నాగిరెడ్డి రచించిన 'తాకట్టులో భారతదేశం' అనే పుస్తకాన్ని తన తండ్రి తనకు ఇచ్చారని, అయితే, ఆ పుస్తకంలో నాగిరెడ్డి ఆలోచనలు, లోతైన అధ్యయనం, గంభీరత ఉండటంతో ఆ వయసులో తాను గ్రహించలేకపోయానని, ఆ పుస్తకంలో రాసిన వాక్యాలు ఇప్పటి పరిస్థితులకు సరిపోతాయని అన్నారు.

ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా నాలుగు సార్లు నాగిరెడ్డి పని చేశారని, భూమి లేని నిరుపేదల కోసం వెయ్యి ఎకరాలను ఆయన దానం చేశారని తెలిపారు. అంత గొప్ప వ్యక్తికి తలవంచి నమస్కరిస్తున్నానని ఆ ట్వీట్‌లో పవన్ పేర్కొన్నారు.

English summary
Jana Sena Party president Pawan Kalyan on Sunday responded on Tarimala Nagi Reddy's Birth Centenary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X