వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొన్ని పైకి చెప్పలేం: పవన్ కళ్యాణ్-నంద్యాల ఉపఎన్నికపై వేణు మాధవ్

నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి తాను మద్దతు ఇవ్వనని, తటస్థంగా ఉంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం చెప్పారు. దీనిపై నటుడు వేణు మాధవ్ స్పందించారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి తాను మద్దతు ఇవ్వనని, తటస్థంగా ఉంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం చెప్పారు. దీనిపై నటుడు వేణు మాధవ్ స్పందించారు.

చదవండి: రేపటి నుంచి హత్యారాజకీయాలు: రోజా సంచలనం, తన ఖాతాలో పడకుండా పవన్ కళ్యాణ్

కొన్ని పైకి చెప్పలేం

కొన్ని పైకి చెప్పలేం

పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరు ఏమంటారని వేణుమాధవ్‌ను మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన మాట్లాడుతూ.. కొన్ని కొన్ని విషయాలు పైకి చెప్పడానికి వీల్లేని పరిస్థితులు ఉంటాయన్నారు.

ఆయన మనసు నిండా భూమా ఫ్యామిలీకే

ఆయన మనసు నిండా భూమా ఫ్యామిలీకే

పవన్ ప్రచారానికి రాకపోవచ్చు గానీ, భూమా ఫ్యామిలీకే సపోర్ట్ చేయాలని ఆయన మనసు నిండా ఉందని తన నమ్మకం అన్నారు. సినీ పరిశ్రమతో భూమా ఫ్యామిలీకి చాలా అటాచ్‌మెంట్ ఉందని వేణుమాధవ్ చెప్పారు.

భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు ఖాయం

భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు ఖాయం

కాబట్టి, వాళ్లు బయటకు చెప్పకపోయినప్పటికీ అంతర్గతంగా చూస్తే వాళ్లందరూ భూమా బ్రహ్మానంద రెడ్డికే మద్దతు ఇస్తారని వేణు మాధవ్ అన్నారు. కచ్చితంగా, బ్రహ్మానందరెడ్డి విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

వేల కొద్ది మెజార్టీ

వేల కొద్ది మెజార్టీ

భూమా బ్రహ్మానంద రెడ్డికి ముప్పై వేలు, నలభై వేలు.. ఇలా మెజార్టీ వస్తుందని వేణు మాధవ్ చెప్పారు. బ్రహ్మానంద రెడ్డిపై పోటీ పడుతున్న వారికి డిపాజిట్ కూడా దక్కదనే వార్తలు వింటున్నానని, శిల్పా మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

అందరి హృదయాల్లో

అందరి హృదయాల్లో

భూమా బ్రహ్మానంద రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టడం వంద శాతం ఖాయమని వేణు మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు అందరి హృదయాల్లో ఉన్నారని వేణు మాధవ్ చెప్పారు.

English summary
Tollywood actor Venu Madhav on Friday said that Jana Sena chief Pawan Kalyan want to support Bhuma Brahmananda Reddy in Nandyal bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X