వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి పవన్ కళ్యాణ్.. ఆలస్యం: '2019లో సీఎంను చేసేందుకు వ్యూహాలు'

2019లో తమ పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆదివారం తెలిపారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: 2019లో తమ పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆదివారం తెలిపారు.

పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు జనసేన సైనికులు కృషి చేస్తున్నారని చెప్పారు. 2019లో ఆయనను సీఎంగా చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరో 7 నెలల తర్వాతే రంగంలోకి పవన్

మరో 7 నెలల తర్వాతే రంగంలోకి పవన్

పవన్ కళ్యాన్ మార్చి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఆయన మహేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ నిర్మాణం జరుగుతోందన్నారు. అంటే అప్పటి దాకా పార్టీని బలోపేతం కోసం ఇప్పుడు పని చేస్తున్నట్లు లేదా అంతకంటే వేగంగా పని చేస్తారు. కానీ నేరుగా రంగంలోకి దిగేది మాత్రం అప్పుడేనని అర్థమవుతోంది. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి వచ్చే అవకాశముంది.

పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారా

పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారా

2019 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ తన పార్టీని సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. తాను అనంతపురం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. పవన్ గుంతకల్లు, లేదా కదిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మిగతా చోట్ల టిడిపికి మంచి బలం ఉంది. కానీ ఈ నియోజకవర్గాలలో ఏ పార్టీకి పెద్దగా పట్టు లేదని, కాబట్టి ఈ నియోజకవర్గాల నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

అందుకే ఆలస్యం..

అందుకే ఆలస్యం..

పార్టీ నడిపేందుకు తన వద్ద డబ్బులేదని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆయన పార్టీ నడపాల్సి ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆయన పూర్తిగా రంగంలోకి దిగిన తర్వాత విరాళాలు వేరే విషయం. దీంతో మొదట తాను రంగంలోకి దిగడానికి కావాల్సిన నిధులను సినిమాల ద్వారా సమకూర్చుకొని, వచ్చే ఏడాది నేరుగా రంగంలోకి దిగనున్నారు.

క్లారిటీ రాలేదు

క్లారిటీ రాలేదు

పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి పోటీ చేస్తారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. బిజెపిని ఇప్పటికే దూరం పెట్టారు. కానీ అప్పటి రాజకీయ పరిణామాలను బట్టి.. బిజెపి - టిడిపిలు విడిపోతే చంద్రబాబుతో చేయి కలుపుతారా లేదా అనేది ఇప్పుడు తేలే అంశం కాదు. ఇక వైసిపి - జనసేనలు కలిసి పని చేసే అవకాశం కనిపించడం లేదు. జనసేన, లెఫ్ట్ పార్టీలు మాత్రం కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Jana Sena vice president Mahender Reddy on Sunday said that Pawan Kalyan will become CM in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X