తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘బర్డ్’లో టపాసులు కాల్చిన చిన్నారులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: అంగవైకల్యానికి గురై చికిత్స పొందడానికి బర్డ్‌ ఆస్పత్రిలో చేరిన చిన్నారులు డైరెక్టర్ జగదీష్ నేతృత్వంలో జరుపుకున్న దీపావళి సంబరాల ముందు వారి వ్యాధి, బాధలు చిన్నబోయాయి. బర్డ్‌లో చికిత్స పొందుతున్న అంగవైకల్యం కలిగిన రోగుల కోసం డైరెక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. ఇందులో టపాకాయలతో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ఎంజి గోపాల్, ఆయన సతీమణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో బాణాసంచా కాల్పించే కార్యక్రమాన్ని గోపాల్, ఆయన సతీమణి ప్రారంభించారు. ఈసందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి అంగవైకల్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రోగులకు తాము దీపావళి జరుపుకోలేకపోయామే అన్న భావన కలగనీయకుండా వారి కోసం సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ అంగవైకల్యం కలిగినవారి కోసం తమిళనాడుకు చెందిన వ్యక్తి బాణాసంచాను విరాళంగా ఇచ్చినందుకు ఆయన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. బర్డ్‌లో క్రమం తప్పకుండా దీపావళి సంబరాలు నిర్వహిస్తున్న డైరెక్టర్ డాక్టర్ జగదీష్‌ను తాను అభినందిస్తున్నానన్నారు. జగదీష్ ఒక నిబద్ధత కలిగిన డాక్టర్ అన్నారు. అందుకే ఆయన ఉద్యోగ విరమణ కాలం పూర్తయినా, మరో రెండు సంవత్సరాల పాటు బర్డ్ డైరెక్టర్‌గా కొనసాగే అవకాశం టిటిడి కల్పించిందన్నారు.

బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ.. వ్యాధులతో చికిత్స పొందుతున్న మాత్రాన దీపావళి వంటి గొప్ప పండుగకు దూరమయ్యామన్న బాధ వారిలో తలెత్తకూడదన్న ఆలోచనతోనే ఈ సంబరాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంబరాలు గొప్పగా జరుపుకోవడానికి ఎండిఎంకె అధినేత వైగో లక్షల రూపాయలు విలువచేసే టపాకాయలను, చిత్తూరు జిల్లా వాయల్పాడు చెందిన ప్రకాష్ రోగుల కోసం స్వీట్లు పంపుతున్నారన్నారు. వారికి రోగుల తరుపున తాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాన్నారు.

పలువురు రోగులు మాట్లాడుతూ.. తమ వ్యాధులు నయం చేయడానికి ఓ వైపు బర్డ్ డైరెక్టర్ చికిత్స చేస్తూనే తమ ఆనందం కోసం దీపావళి సంబరాలను నిర్వహించడం జీవితంలో ఒక మరపురాని ఘట్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ, అధికారులు, సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.

టపాసులు కాల్చుతూ..

టపాసులు కాల్చుతూ..

ప్రమాదవశాత్తో, పుట్టుకతోనో పలు రకాల అంగవైకల్యంతో చికిత్స పొందడానికి బర్డ్‌ ఆస్పత్రిలో ఉంటున్న రోగులు డైరెక్టర్ జగదీష్ నేతృత్వంలో జరుపుకున్న దీపావళి సంబరాల ముందు వారి వ్యాధి, బాధలు చిన్నబోయాయి.

టపాసులు కాల్చుతూ..

టపాసులు కాల్చుతూ..

బర్డ్‌లో చికిత్స పొందుతున్న అంగవైకల్యం కలిగిన రోగుల కోసం డైరెక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది.

టపాసులు కాల్చుతూ..

టపాసులు కాల్చుతూ..

ఇందులో భాగంగా బుధవారం తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి విరాళంగా ఇచ్చిన టపాకాయలతో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు.

టపాసులు కాల్చుతూ..

టపాసులు కాల్చుతూ..

ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ఎంజి గోపాల్, ఆయన సతీమణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో బాణాసంచా కాల్పించే కార్యక్రమాన్ని గోపాల్, ఆయన సతీమణి ప్రారంభించారు.

టపాసులు కాల్చుతూ..

టపాసులు కాల్చుతూ..

ఈసందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి అంగవైకల్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రోగులకు తాము దీపావళి జరుపుకోలేకపోయామే అన్న భావన కలగనీయకుండా వారి కోసం సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

English summary
The festival of Lights-Diwali has ventured as a pleasant surprise to lit the lights of joy in the lives of the in-patients in the pediatric ward of TTD-run Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled (BIRRD) in the temple city of Tirupati on Wednesday evening amidst pomp and gaiety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X